ర‌ష్యాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. మాస్కోలోని షెరమిత్యేవో ఎయిర్‌పోర్టులో విమాన ప్ర‌మాదం జ‌రిగింది. ఎయిర్‌పోర్టు నుంచి విమానం బ‌య‌లుదేరింది. అయితే ఆ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఫైల‌ట్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. అప్ప‌టికే జ‌రగాల్సిన ఘోరం జ‌రిగిపోయింది. వేగంగా మంట‌లు వ్యాపించ‌డంతో ఇద్ద‌రు చిన్నారులు, ఎయిర్ స్టీవార్డ్ స‌హా 41 మంది మ‌ర‌ణించారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


అయితే మాస్కో కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఫ్లైట్‌లో 73 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్లేయిన్ చివ‌రి భాగంలో ద‌ట్ట‌మైన న‌ల్ల‌ని పొగ‌తో.. నిప్పులు చిమ్ముకుంటూ నింగి నుంచి దూసుదూసుకువ‌చ్చింది విమానం. అలా దూసుకొస్తున్న విమానం ర‌న్‌వే పై వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. 


ఫ్లైట్ ఆగ‌డంతో అందులోని ప్ర‌యాణికులు ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి కింద‌కి జారి.. ప్రాణాల‌ను కాపాడుకున్నారు. ఈ దృశ్యాల‌న్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవున్నాయి. కాగా.. విమానానికి మంట‌లు అంటుకున్నాయ‌ని ఎగ్జిట్ దోర్ల ద్వారా కింద‌కు దిగాల‌ని సిబ్బంది ఎన్నిసార్లు చెప్పిన విన‌ని ప్ర‌యాణికులు.. త‌మ ల‌గేజీ తీసుకుని దిగ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని.. అందువ‌ల్లే వారిని కింద‌కు దించ‌డం ఆల‌స్య‌మైంద‌ని ఎయిర్ పోర్టు అధికారి ఒక‌రు తెలిపారు. 


అయితే రష్యన్‌ మేడ్‌ సూపర్‌జెట్‌-100 విమానం టేకాఫ్‌ అయిన కాసేప‌టికే అందులో స‌మ‌స్య ఉందంటూ సిబ్బంది సిగ్న‌ల్స్ ఇచ్చార‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష‌లు తెలిపారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడానికి పైలట్‌ ప్రయత్నించాడ‌ని.. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంద‌ని పేర్కొన్నారు. అయితే సెకండ్ టైమ్ ల్యాండ్ అయ్యారు. కానీ అప్ప‌టికే ఆ ఫ్లైట్ మంట‌ల్లో పూర్తిగా చిక్కుకుని పోయింది. 


మంట‌ల్లో విమానం తోక భాగం పూర్తిగా కాలిబూడిదైపోయింది. ప్రయాణికులను రక్షించే క్రమంలో ఒక ఫ్లైట్‌ అటెండెంట్‌ మరణించింది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక ప్రయాణికుడు.. తాను క్షేమంగా ఉన్నానని ట్విటర్‌లో ద్వారా వెల్లడించాడు. అయితే, అందరూ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని అందులో పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: