చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది.  వివి ప్యాట్లపై విపక్షాలు వేసిన కేసును కోర్టు వినకుండానే కొట్టేసింది. వివి ప్యాట్ల లెక్కింపుపై విచారణ మొదలుకానున్న కేసులో హాజరయ్యేందుకు చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా సుప్రింకోర్టుకు హాజరయ్యారు. ఈవిఎంల్లోని వివి ప్యాట్ల ను లెక్కించే విషయంలో 21 పార్టీల తరపున సుప్రింకోర్టులో కేసు వేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఎలాగైనా సరే వివి ప్యాట్ల లెక్కింపు  విషయంలో  ఎలక్షన్ కమీషన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. చంద్రబాబు గోలను సుప్రింకోర్టు పట్టించుకుంటుందో లేదో తెలీదు కానీ సిఎం మాత్రం ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా వివి ప్యాట్ల జపమే చేస్తున్నారు. ఈవిఎంల్లోని వివి ప్యాట్లలో కనీసం 50 శాతం వివి ప్యాట్లను లెక్కించాలన్నది చంద్రబాబ డిమాండ్. అందుకు ఎలక్షన్ కమీషన్ అంగీకరించటం లేదు.

 

 ఆ విషయమై  చివరకు చంద్రబాబు అండ్  కో సుప్రింకోర్టులో కేసు వేసింది. ఆ కేసు విషయంపైనే మంగళవారం విచారణ మొదలుకానుంది. అందుకనే వ్యక్తిగతంగా చంద్రబాబు కోర్టులో హాజరయ్యారు. అంటే చంద్రబాబుతో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్బుల్లా కూడా హాజరయ్యారు లేండి.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే తనపై ఉన్న కేసుల్లో ఏ ఒక్కదానిలో కూడా చంద్రబాబు ఏనాడూ కోర్టుకు హాజరయ్యింది లేదు.  వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టులు చెప్పినా చంద్రబాబు వినకుండా తన లాయర్ ను మాత్రమే పంపిన విషయం తెలిసిందే. అలాంటిది వివి ప్యాట్ల విషయంలో మాత్రం చంద్రబాబు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారు.

 

మొత్తానికి చంద్రబాబు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైనా సుప్రింకోర్టు ఏమాత్రం పట్టించుకోలేదు. వివి ప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. వివి ప్యాట్ల లెక్కింపులో ఎలక్షన్ కమీషన్ వాదననే సమర్ధించింది. అంటే చంద్రబాబు చేస్తున్న హడావుడి మొత్తం కేవలం రాజకీయమే అని సుప్రింకోర్టు అభిప్రాయపడింది కాబట్టే కేసును కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: