పోలవరం ప్రాజెక్ట్ మీద మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికరమైన  కామెంట్స్ చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. పోలవరం అంచనాలపై ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.


పోలవరం ముంపు ప్రాంతాల  పునారావాస ప్యాకేజి గురించి బాబు ఆలోచించారా అని ఉండవల్లి ప్రశించారు. 30 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. అటువంటి దాని మీద బాబు నిధులు ఎక్కడ నుంచి తెస్తారొ  చెప్పాలని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ 2020 నాటికి పూర్తి అని బాబు అంటున్నారని, అయితే అది ఎప్పటికైనా పూర్తి అవుతుందా అన్నదే తన డౌట్  అని ఉండవల్లి సెటర్లు  వేశారు. పోలవరంపై తనకున్న డౌట్లు బాబు తీరిస్తే క్షమాపణలు చెబుతానని ఆయన అన్నారు. 


చంద్రబాబు అతిగా ఈ మధ్య ఆవేశపడుతున్నారని ఉండవల్లి అన్నారు. సీఎస్ పైన ఆయన గొడవ పడడం విచిత్రంగా ఉందని  అన్నారు. కోడ్ అమల్లొ ఉన్నపుడు ఏమీ చేయలేమన్న సంగతి బాబుకు తెలియదా అన్నారు. తనకు కావాల్సిన వారికి బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే బాబు సీఎస్ తో గొడవ పడుతున్నట్లుగా అనిపిస్తోందని అన్నారు ఒకవేళ   టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే  ఏమీ జరగదని, పార్టీ ప్రజల్లోనే ఉంటుందని ఉండవల్లి అన్నారు. అందువల్ల ఫలితాలు వచ్చే వరకూ అయినా బాబు ఆందోళన తగ్గించుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: