కృష్ణ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ప్రదీప్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేసి వాటికి సంబంధించిన టాక్స్ లు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరిపిన అధికారులు ప్రదీప్‌ కుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 


పలు రాష్ట్రాల్లో బంగారం బిజినెస్ చేస్తున్నారు. ఐతే… అక్రమంగా బంగారం కొనుగోలు చేసి రవాణా చేయడం.. పన్నులు కట్టకపోవడం లాంటి కారణాలతో ప్రదీప్ కుమార్, ఆయన కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.


దీంతో ప్రదీప్ కుమార్, సాయి చరణ్ లను పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. ప్రదీప్‌ కుమార్‌ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 35 జువెలరీ షాప్ లు నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: