వారం రోజుల పర్యటన నిమ్మిత్తం తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్ళారు. ముందుగా కేరళలో పర్యటిస్తున్నారు. హఠాత్తుగా రెండు రాష్ట్రాల పర్యటనలకు కెసియార్ ఎందుకు వెళ్ళారు ? అన్న అంశంపైనే చర్చలు జోరందుకున్నాయి. ఏదో కాలక్షేపానికైతే కెసియార్ పై రాష్ట్రాల పర్యటనకు వెళ్ళరన్నది అందరికీ తెలిసిందే.

 

పార్లమెంటు ఎన్నికల నేపధ్యంలో కెసియార్ చేస్తున్న పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బహుశా కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్, తమిళనాడులో డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ను ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటానికే కెసియార్ వెళ్ళారన్నది పైకి వినిపిస్తున్న మాట.

 

నిజానికి పైకి వినిపిస్తున్న మాటే నిజమైతే అసలు కెసియార్ టూర్ పెట్టుకుని ఉపయోగమే లేదని చెప్పవచ్చు.  ఎందుకంటే,  ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకు రావాలని కెసియార్ అనుకునేంత పిచ్చోడైతే కాదు కెసియార్. కేరళలో ఉన్నది లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వమే అయినా అదేమీ విజయన్ సొంత పార్టీ కాదు. రాజకీయ నిర్ణయాలైన, విధానపరమైన నిర్ణయాలైన తీసుకునేది సిపిఎం కేంద్ర కమిటీయే అన్న విషయం తెలిసిందే.

 

జాతీయ స్ధాయిలో సిపిఎం పాలిట్ బ్యూరో తీసుకునే నిర్ణయాన్నే విజయన్ అనుసరించాల్సుంటుంది. సిపిఎంను ఫెడరల్ ఫ్రంట్ లోకి తేవాలంటే కెసియార్ చర్చించాల్సింది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శితోనే కానీ విజయన్ తో కాదు. ఇక తమిళనాడులో స్టాలిన్ తో భేటీ కూడా ఏమాత్రం ఉపయోగం లేనిదే. ఎందుకంటే, డిఎంకె ఇప్పటికే యూపిఏలో యాక్టివ్ భాగస్వామిగా ఉంది. కాబట్టి యూపిఏని వదిలి పెట్టి రావటం కష్టమే.

 

పై రెండు విషయాలు తెలిసి కూడా కెసియార్ పై రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఏదో కుటుంబ సభ్యులు పద్మనాభస్వామి ఆలయానికి వెళ్ళాలంటేనో లేకపోతే చెన్నైకి వెళ్ళాలంటేనో సరదాగ వెళ్ళటంలో తప్పేమీ లేదు. కాని దానికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదు కద. చూద్దా తిరిగి వచ్చిన తర్వాతైనా విషయం బయటపడకుండా పోతుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: