తెలంగాణలో ఇంటర్ బోర్డు ఫలితాల కారణంగా 24 మంది విద్యార్థులు నిర్థాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు.  ఎంతో కష్టపడి రేయింబవళ్లూ కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే..తాము ఊహించని దారుణమైన ఫలితాలు రావడంతో మనసు వికలం చెంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఇంటర్ ఆత్మహత్య నమోదైంది.

జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల మానస ప్రాణం కోల్పోయింది. ఆమె వయస్సు 17 ఏళ్లు.  ఇంటర్ ఫస్టీయర్ ఎగ్జామ్స్ రాసింది..గత నెల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఫెయిల్ అయింది. తాను ఎంతో కష్టపడి రాసానని దారుణంగా సింగిల్ డిజిట్ తో మార్కులు రావడంతో మనస్తాపానికి లోనయ్యింది.

ఫలితాలు వచ్చినరోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆమెను కుటుంబసభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొచ్చారు.  దాదాపు ఇరవై రోజులు మృత్యువుతో పోరాడిన సాయిల మానస  ట్రీట్ మెంట్ తీసుకుంటుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: