ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ ఏనిమిది రోజుల పసిపాప మాయమైంది.   కేంద్ర ఆసుపత్రిలో శిశువు మాయం కావడంతో కలకలం రేగింది. జాండీస్‌తో బాధపడుతున్న పాపను తల్లిదండ్రులు 5 రోజుల క్రితం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇంక్యుబేటర్‌లో పెట్టేందుకు ఆయమ్మ పాపను తీసుకెళ్లింది. 

కొద్ది సేపటి తర్వాత ఆ పాప తల్లిదండ్రులు వచ్చి తమ పాప ఎలా ఉందని..పాపను ఇస్తారా అనగానే ఆయమ్మ ఆ శిశువు మీ పాప కాదని వేరేవాళ్లకు ఇచ్చానని  చెప్పింది.  దాంతో ఒక్కాసారే షాక్ తిన్న పాప తల్లిదండ్రులు తమ చేతులతోనే మీకు అప్పజెప్పామని..తీరా పాపను మాకు ఇవ్వకుండా వేరెవరికో ఇచ్చామని నిర్లక్ష్యంగా చెప్పడంతో తమ పాప ఎక్కడని ఆయమ్మను వారు గట్టిగా నిలదీశారు.

ఆసుపత్రి సిబ్బందితో శిశువు తల్లిదండ్రులు, బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని..వైద్య సిబ్బంది ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: