ఈ మద్య దొంగలు బాగా తెలివి నేర్చారు..ఇళ్లలో, షాపుల్లో దోపిడీలు చేసేవారు ఇప్పుడు ఈజీగా ఏటీఎం లను టార్గెట్ చేస్తున్నారు.  ఆ మద్య ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి తెగబడ్డారు..అయితే నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం..రోడ్లపై పోలీసులు ఎక్కువగా గస్తీ తిరగడంతో  ఈ మద్య చైన్ స్నాచింగ్ లు తగ్గాయి. 

తాజాగా ఏటీఎంలలో డబ్బులు నింపే సిబ్బంది దృష్టి మరల్చి ఏకంగా రూ.70 లక్షలను దుండగలు దోచుకున్నారు. వనస్థలిపురంలోని పనామా వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపేందుకు ముగ్గురు సిబ్బంది ఓ కారులో వచ్చారు.  కారు నుండి డబ్బులు తీసి ఏంటీఎంలో వేసే క్రమంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి కారు ముందు డబ్బులు పడి ఉన్నాయి..మీవేనా అని అన్నారు. 

దాంతో  ఆ సిబ్బంది అత్యాశతో కారు ముందు ఉన్న డబ్బు కోసం ముందుకు రాగా.. వారిని గమనించిన దుండగులు కారు వెనుక భాగంతో ఉన్న డబ్బును తీసుకొని పరారయ్యారు. అచ్చిం సినీ ఫక్కీలో జరిగిన ఈఘటన తో సిబ్బంది బిత్తర పోయారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలినికి చేరుకుని, క్లూస్ టీమ్ లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం, అత్యాశ వల్లనే ఈ దోపిడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: