వ‌ర‌క‌ట్న వేధింపులు ఆగ‌డం లేదు. మొన్న‌టికొ మొన్న సాక్ష్యాత్తు న్యాయం చెప్పాల్సిన ఓ మాజీ రిటైర్డ్ జ‌డ్జే త‌న కోడ‌లిని అద‌న‌పు క‌ట్నం కోసం వేధించిన విష‌యం తెలిసిందే. ఆమె భ‌ర్త‌, అత్తామామ‌లు క‌లిసి ఆ అడిబిడ్డ‌ను చిత్ర హింస‌లు, మాన‌సిక క్షోభ‌కు గురి చేశారు. ఇంకా ఇలాంటివి ఎన్నో జ‌రుగుతున్నాయి. త‌ర‌చూ టీవీల్లోనూ.. పేప‌ర్ల‌లోనూ చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఇలాంటి మ‌రో ఘ‌ట‌న సూర్య‌పేట జిల్లాలో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులకు మ‌రో వివాహిత‌ బ‌లైంది.


త‌న చావుకు కార‌ణం అత్తింటి వేధింపులే అంటు ఓ మ‌హిళ సెల్ఫీ వీడియో క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు నెల రోజుల త‌ర్వాత ఈ సెల్ఫీ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసులు.. ఇప్పుడు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


సూర్య‌పేట జిల్లా త‌మ్మారం గ్రామానికి చెందిన క‌ల్ప‌న‌కు మూడేళ్ల క్రితం ర‌ఘ‌నాథ‌పాలెంకు చెందిన వీరారెడ్డితో వివాహం జ‌రిగింది. క‌ల్ప‌న త‌ల్లిదండ్రులు క‌ట్నకానులు కూడా బాగ‌నే ఇచ్చారు. క‌ట్నంగా మూడెక‌రాల పొలం ఇచ్చారు. ఏడాది కాలం పాటు హ్యాపీగా సాగిన వీరి జీవితంలో క‌ట్న దాహం ఆవ‌హించింది. ఇక ఆ క్ష‌ణం నుంచి ఆ మ‌హిళ‌ల‌కు క‌ట్న వేధింపులు మొద‌ల‌య్యాయి. 


అద‌నంగా క‌ట్నం తీసుకురావాలంటూ క‌ల్ప‌న‌ను అత్తింటి వారు టార్చ‌ర్ పెట్టారు. అయితే ఈ విష‌యం ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా కొద్ది రోజుల కాలం గ‌డుపుతూ వ‌చ్చింది. ఏదో ఒక రోజు వారిలో మార్పు వ‌స్త‌ది లే.. అనుకొని ఓపిక‌గా ఉంది. మార్పు రావ‌డం దేవుడెరుగు.. ఇక ఆమెకు వేధింపులు మ‌రీ ఎక్కువ‌య్యాయి. ఆమెను మాన‌సిక వేధ‌న‌కు గురిచేశారు. 


ఒకవైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు.. మ‌రోవైపు అత్తింటి వేధింపులు క‌ల్ప‌న‌ను మాన‌సికంగి కుంగిప‌డేశాయి. దీంతో క‌న్న త‌ల్లిదండ్రుల‌ను ఇబ్బంది పెట్ట‌లేక అత్తింటి వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది ఆ మ‌హిళ‌. ఈ ఘట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇది స‌హ‌జ‌మ‌ర‌ణంగా క్లోజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు..


అత్తింటి వేధింపుల వ‌ల్లే త‌మ కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమె త‌ల్లిదండ్రులు స్ప‌ష్టం చేశారు. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ప‌ట్టించుకోలేదు. పైగా నిందితుల‌కే వ‌త్తాసు ప‌లికార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు క‌ల్ప‌న త‌ల్లిదండ్రులు. అయితే క‌ల్ప‌న తాను ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో అన్ని వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
ఇప్పుడు ఆ వీడియో వెలుగులోకొచ్చింది. దాదాపు నెల‌రోజుల త‌ర్వాత‌ వీడియో వెలుగులోకి రాగానే  పోలీసులకు క‌ళ్లు మెలుకువ వ‌చ్చింది. ఆ వీడియో ఆధారంగా క‌ల్ప‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన ఆమె భ‌ర్త తో పాటు అత్త‌, ఆడ‌ప‌డుచుల‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు త‌ర‌లించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: