పోలవరం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కేవలం కమిషన్ల కోసమే చూశారు తప్ప ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ని ఎలా పూర్తిచేయాలని ఆలొచించలేదని అన్నారు. పోలవరం విషయంలో పూటకో మాట మాట్లాడే చంద్రబాబు దాన్ని ఎట్టి పరిస్థితిల్లొనూ  పూర్తి చేయలేరని బొత్స  అన్నారు.


పోలవరంపై మాట్లాడే అర్హత నీకుందా బాబూ అంటూ బొత్స అడిగి కడిగేశారు. రాజమండ్రిలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం నిజానికి వైఎస్సార్ డ్రీమ్  ప్రాజెక్ట్ అని  తన పరిపాలనలో , అన్ని అనుమతులను వైఎస్సార్ తీసుకువచ్చారని, ఆయన హయాంలోనే పూర్తి చేద్దామనుకున్నారని బొత్స చెప్పుకొచ్చారు. వైఎస్సార్ జనం మధ్యనుంచి దూరం కావడంతో పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందని అన్నారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ని రెండేళ్ల పాటు పట్టించుకోలేదని బొత్స విమర్శించారు.


ఇక ఆ తరువాత నుంచి రేపు మాపు ప్రాజెక్ట్ పూర్తి అంటూ కబుర్లు చెబుతూ  బాబు పుణ్యకాలం కాస్తా  దాటించారని బొత్స అన్నారు. 2019 నాటికి గ్రావిటీతో నీటిని ఇస్తామని చెప్పిన చంద్రాబు ఇపుడు 2020 అంటున్నారని ఆయన విమర్శించారు. బాబు ఎటూ పోలవరం పూర్తి చేయలేరని, రేపు వచ్చేది జగన్ సర్కార్ అని, తమ ప్రభుత్వం పోలవరం  పూర్తి చేస్తుందని,  తప్పనిసరిగా జాతికి అంకితం చేస్తుందని బొత్స చెప్పారు. మొత్తం మీద బాబు పోలవరం విషయం కెలకడం కాదు కానీ అటు కేవీపీ, ఇటు ఉండవల్లి, మరో వైపు బొత్స బాగానే తగులుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: