సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీ ఓటమి పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. అయినా, టీడీపీ ఓడిపోతే నష్టమేంటి. టీడీపీకి గెలుపోటములు పెద్ద సమస్య కాదు. చంద్రబాబుకి 10 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో చక్రం తిప్పగలరు. చంద్రబాబు తర్వాత ఎలాగూ పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కే వెళతాయి. కాబట్టి, ఓడిపోతే టీడీపీకి ఏదో అయిపోతుందని చంద్రబాబు భయపడిపోవడంలో అర్థమేలేదు..' అని ఉండవల్లి వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిథులూ ఒకింత అవాక్కయ్యారు.


ఇదిలావుంటే, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు చాలా జాగ్రత్తగా నిర్మించాల్సి వుందనీ, అశ్రద్ధ కారణంగా ప్రాజెక్టు సమీపంలో భూమి కుంగిపోతోందనీ, ఇవే అజాగ్రత్తలు కొనసాగితే, రాజమండ్రి ప్రాంతం పోలవరం కారణంగా మునిగిపోయే ప్రమాదం వుందని ఉండవల్లి వ్యాఖ్యానించడం గమనార్హం.


కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులపై చంద్రబాబు అక్కసు వెల్లగక్కడాన్నీ ఉండవల్లి తప్పుపట్టారు. వైఎస్‌ హయాంలో, రాజమండ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మీటింగులకి అప్పటి ఎన్నికల కమిషన్‌ నియమించిన పోలీస్‌ అధికారి వెంకటేశ్వరరావు అడ్డుతగిలారనీ, తాము అధికారంలో వున్నా ఆ పోలీస్‌ అధికారి చర్యలకు వ్యతిరేకంగా వ్యవహరించలేకపోయామనీ ఆనాటి విషయాల్ని మీడియాలో పంచుకున్నారు ఉండవల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: