కాంగ్రెస్ పార్టీలో కొత్త సంచ‌ల‌నం వివాదంలో నెల‌కొంది. ముఖ్య‌నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆస‌క్తిక‌రంగా విమర్శ‌లు చేసుకుంటున్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఇష్టాగోష్టిగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో యూపీఏ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కూట‌మిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్‌లు కీలకం అయినా ఆశ్చర్య పోనక్కరలేదని వ్యాఖ్యానించారు. దీనిపై  తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని అన్నారు.

జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు నేత‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించే విధంగా ఉన్నాయ‌ని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. ``ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా చేరబోతోందని చెబితే, స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుంది. యూపీఏ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్ధితి ఉంటే టీఆర్ఎస్‌తో పాటు వైసీపీ మద్దతు అవసరం ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు గెలవలేనప్పుడే యూపీఏలో లేని పార్టీల మద్దతు కోసం ఆలోచించాల్సి ఉంటుంది. ఓవైపు పూర్తి మెజారిటీతో కేంద్రంలో rahul NEW' target='_blank' title='click here to read more about rahul NEW'>రాహుల్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం ఏర్పడుతుందని హైకమాండ్ నేతలు చెబుతుంటే, దానికి భిన్నంగా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హైకమండ్ మాటల కంటే, టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్న కేసీఆర్ మాటలను ఆయన విశ్వసిస్తున్నారేమో? కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదు' అని విజయశాంతి పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: