ఏపీలో ఈదురుగాలులు బీభ‌త్సం సృష్టించాయి. భారీ వ‌ర్షం, భీకర‌మైన గాలులు వెర‌సి క‌ల‌క‌లం రేకెత్తించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా ఈదురుగాలులు, వర్షం బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప‌లు గంట‌ల పాటు జ‌న‌జీవ‌నం స్తంభించింది.


ఉధృతంగా వీస్తున్న గాలులకు ఏపీ సచివాలయం ఎంట్రీ పాయింట్‌ కూలిపోయింది. గాలల ధాటికి రెండోబ్లాక్‌ టెర్రస్‌పై రేకులు ఎగిరిపోయాయి. దురుగాలులకు నాలుగో బ్లాక్‌ రేకులు విరిగిపడ్డాయి. సచివాలయం ప్రాంగణంలో ఉన్న స్మార్ట్‌పోల్‌ కూడా కూలిపోయింది. గాలికి హైకోర్టు భవనంలో అద్దాలు పగిలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఏపీలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జ‌నాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: