ప్రస్తుతం చంద్రబాబుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క ఈవీఎంల గురించి బాబు నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. వీవీ ప్యాట్స్ విషయంలో వీళ్లు ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు. అప్పుడు కోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీ ప్యాట్స్ ను లెక్కించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు వీళ్లు మళ్లీ పాత వాదనతో వెళ్లారు. దీంతో వీరి పిటిషన్ ను ఒక్క నిమిషం పాటు విచారించి, కొట్టేసింది కోర్టు.


తాము విచారించిన అంశాన్నే ఎన్నిసార్లు విచారించాలి? అని కోర్టు ప్రశ్నించింది. ఇక కేబినెట్ మీటింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు తన ఇగోని లీకుల రూపంలో ప్రదర్శించారు. మే పదో తేదీన కేబినెట్ మీటింగ్ అని, దానికి అధికారులు ఎలా రారో చూస్తామంటూ చంద్రబాబు నాయుడు లీక్ ఇచ్చారు. ఈ విషయంలో సీఎస్ తాపీగా సమాధానం ఇచ్చారు.


రావడానికి, రాకపోవడానికి తమకేం ఇగో లేదు.. ఎన్నికల సంఘం ఎలా చెబితే అలా చేస్తాం.. వెళ్లి ఈసీ అనుమతి తెచ్చుకోండని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సూటిగా సుత్తిలేకుండా బాబుకు చెప్పారట. మరి ఇప్పుడు కేబినెట్ భేటీకి ఈసీ నుంచి అనుమతి తెచ్చుకోవడం చంద్రబాబు చేతిలో ఉంది. వీళ్లు ఏం చెప్పి ఈసీని ఒప్పిస్తారో చూడాల్సి ఉంది.  మొత్తానికి ఒకేరోజు అమరావతిలో ఒక దెబ్బ, ఢిల్లీలో మరో దెబ్బ పడినట్టుగా ఉంది చంద్రబాబుకు! ఇదంతా స్వయంకృతమే అనేది పరిశీకులు మాట!

మరింత సమాచారం తెలుసుకోండి: