ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలనుకుంటున్న కేసీఆర్ తనకు సహకరించే నాయకులూ కనిపించడం లేదు. ఒక్కొక్కరు కేసీఆర్ కి జలక్ ఇస్తున్నారు. ఇదివరకూ వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు కేసీఆర్. అప్పటి సమావేశాలు ఏవీ అంత ఫలప్రదం కాలేదు. జేడీఎస్ వాళ్లు మాట్లాడారు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ తో వెళ్లిపోయారు. అప్పట్లోనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్ తో సమావేశం కాలేదు! ఏదో వివరణ ఇచ్చి తప్పించుకున్నాడతను. దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్  ప్రయత్నాలు అప్పుడు విజయవంతం కాలేదని విశ్లేషకులు తేల్చారు.


ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో కేసీఆర్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగుతాయని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో భాగంగా  మళ్లీ వివిధ పార్టీల వాళ్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అయితే ఈసారి కూడా కేసీఆర్ కు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాడు నేత స్టాలిన్ కేసీఆర్ తో సమావేశం పట్ల అంత ఆసక్తి చూపకపోవడం అలాంటి వాటిల్లో ఒకటి.


ఇది ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా ఒత్తి చెబుతున్న అంశం అవుతోంది. స్టాలిన్ తో కేసీఆర్ సమావేశానికి తేదీ ఖరారు అయ్యిందని ముందుగా టీఆర్ఎస్ వాళ్లు హడావుడి చేశారు. అయితే స్టాలిన్ ఇలాంటి  ఫ్రంట్ లోకి వచ్చే ఛాన్సుల ఏమాత్రం కనిపించడం లేదు. అతడు కాంగ్రెస్ తో అతుక్కుపోయాడు. చివరకు ఇప్పుడు కేసీఆర్ తో సమావేశం పట్ల కూడా స్టాలిన్ ఆసక్తి చూపడంలేదని తేలిపోయింది. రాహుల్ ను ప్రధానిగా ప్రతిపాదించిన తొలి ప్రాంతీయ పార్టీ అధినేత అయిన స్టాలిన్ ను కేసీఆర్ కెళకాల్సిన అవసరమే లేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: