చంద్రబాబు, జగన్ మధ్య జరిగిన ఈ ఎన్నికల పోరాటం.. ఇదే ఆఖరా.. ఇక భవిష్యత్తులో వీరిద్దరూ ముఖాముఖి పోరాటే అవకాశం లేదా.. అంటే..దాదాపు లేదనే చెప్పాలి. అదెలాగో చూద్దాం.. ఓ ప్రజానాయకుడిగా జగన్ ఏపీ ప్రజలకు పరిచయమై దాదాపు 14 ఏళ్లు.. సొంత పార్టీ పెట్టుకునే దాదాపు 9 ఏళ్లు.


ఓ ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్లు మనుగడ సాధించడం చాలా కష్టం. అందులోనూ జగన్ వంటి నాయకులపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా కష్టాలు పెట్టే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికి ఇవి జగన్ ఎదుర్కొంటున్న రెండో ఎన్నికలు. ఇప్పటికే పార్టీ కాపాడుకుంటూ రావడమే జగన్‌కు పెద్ద సవాలు. 

ఇక ఇప్పుడు ఓడిపోతే.. ఇక వైసీపీ మళ్లీ 2024 ఎన్నికల వరకూ మనగలగడం అంత ఈజీ కాదు. దాదాపు ఇదే పరిస్థితి టీడీపీది కూడా ఒక వేళ టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ మనుగడ కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. చంద్రబాబుకు వయోభారం మీద పడుతోంది. అటు లోకేశ్ కు పార్టీ నాయకత్వ బాధ్యత అప్పగిస్తే పార్టీ ఎంత వరకూ నిలబడుతుందన్నది ప్రశ్నార్థకం.

పోనీ చంద్రబాబే పార్టీని నడిపిస్తాడని అనుకున్నా.. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టీడీపీని అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. సో..అటు జగన్, ఇటు చంద్రబాబు.. వీరిలో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. వచ్చే ఎన్నికలకు మళ్లీ వీరు ప్రత్యర్థులుగా పోరాడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పారు. అందుకే ఇది చంద్రబాబు, జగన్‌ ఆఖరి పోరాటం అంటున్నది. 



మరింత సమాచారం తెలుసుకోండి: