ఎంతైనా పాత బంధాలు అంత తొందరగా విడిపోవు. జగన్ రాజకీయ పుట్టుక కాంగ్రెస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అదే కాంగ్రెస్ జగన్ని దారుణంగా పార్టీ నుంచి పొమ్మకుండా పొగ బెట్టి వెళ్లగొట్టిందన్న సంగతి తెలిసిందే. ఓ విధంగా జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్లాకే నాయకుడుగా ఎదిగారు. ఆయన ఇపుడు ఏపీలో బలమైన నాయకుడు. రేపటి రోజున ఏపీలో అధికారంలోకి వస్తాడని అన్ని సర్వేలు చెబుతున్న సందర్భం.


మరి అటువంటి జగన్ తమవాడేనని చెప్పుకోక కాంగ్రెస్ ఏం చేస్తుంది. రాజకీయల్లో శత్రువులు ఎవరూ ఉండరు. మరి జగన్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడే. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లో మూడున్న దశాబ్దాల బంధం పెనవేసుకున్న వారు. కాంగ్రెస్ సీఎం గానే ఆయన మరణించారు. అంతటి బంధం ఉన్న ఆ కుటుంబానికి కాంగ్రెస్ ఇపుడు చేరదీసే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారు.


దానికి సంబంధించి ఫీలర్స్ కూడా వదులుతున్నారు. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ చూస్తే జగన్ కోసం కాంగ్రెస్ అపుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా అర్ధమవుతోంది. జగన్ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని జగ్గారెడ్డి అంటున్నారు. జగన్ తమతోనే కలసి వస్తారని కూడా ఆయన ధీమాగా చెబుతున్నారు. 


అంటే రేపటి రోజున కేంద్రంలో యూపీయే 3 ఏపడాలంటే జగన్ అవసరం కాంగ్రెస్ కి తప్పనిసరి అని గుర్తించారని అంటున్నారు. మరి చంద్రబాబుని ఓ వైపు భుజాల మీద వేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్ కి ఇపుడు జగన్ మద్దతు కావాల్సివచ్చిందంటే జగన్ ఏపీలో గెలవబోతున్నాడన్న సంకేత‌లు ఆ పార్టీకి వచ్చి ఉండాలేమో. మరి జగన్ ఈ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారో. కాంగ్రెస్ ని ఏపీలో లేకుండా చేసిన జగన్ ఇపుడు అదే పార్టీతో కలుస్తారా అన్నది పెద్ద ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: