తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 4వ తేదీన నంద‌మూరి లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. లక్షీపార్వతి తనని లైంగికంగా వేధిస్తుందని, వాట్సాప్‌‌లో ‘మిస్ యూ, లవ్ యూ’ అనే మెసేజ్‌లతో పాటు.. శృంగార దృశ్యాల క్లిప్‌లు కూడా పంపిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్రదుమారం రేగింది. కాగా, తనపై జరుగుతోన్న అసత్య ప్రచారంపై లక్ష్మీపార్వతి డీజీపీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన ఆమె.. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.


అయితే, ఈ ఆరోప‌ణ‌లు ఇత‌ర‌త్రా ప‌రిణామాలు ఇలా ఉంటే...కోటి ఎక్క‌డ అనే ప్ర‌శ్న తెరమీద‌కు వ‌స్తోంది. కోటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన ఓ పార్టీ అనుకూల ఛాన‌ల్లు సైతం కోఠి విష‌యం ప్ర‌స్తావించ‌లేదు. మ‌రోవైపు, ఓ పార్టీ ల‌క్ష్మీపార్వ‌తికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున్నే ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో కోటి వెనుక ఎవరో ఉండి కుట్రలు చేస్తున్నారని, కోటితో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నార‌నే సందేహం తెర‌మీద‌కు వ‌చ్చింది. కోటి అనే వ్యక్తి వెనుక ఏ వ్య‌క్తి లేక‌పోయి ఉండే... ఇంత ప్ర‌చారం జ‌రిగి ఉంటుందా అనే సందేహం స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది.


ఎన్నిక‌ల స‌మ‌యంలో విడుద‌లైన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు, ల‌క్ష్మీపార్వ‌తి వ్య‌క్తిత్వంపై చెడు అభిప్రాయం క‌లిగించేందుకు ఓ పార్టీ పెద్ద‌లు చేసిన ప్ర‌చారంలో భాగ‌మే కోటి ఆరోప‌ణ‌లు, ప్ర‌స్తుతం ఆయ‌న అండ‌ర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవ‌డ‌మని అంటున్నారు. కాగా, లక్షీపార్వతి ఫిర్యాదుని స్వీకరించిన డీజీపీ మహేందర్ రెడ్డిపై కేసుపై సమగ్ర విచారణ చేస్తానని తెలిపారు. అయితే, కేసు సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఆరోప‌ణ‌ల ఎపిసోడ్ కొలిక్కి రావ‌డం లేద‌ని మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: