అంకెలను మానవులు స ష్టించారు కానీ, ఈ రోజున ఈ అంకెలే మానవ జీవితాన్ని శాసిస్తున్నాయి. మానవ మనుగడ అంకెలతో ముడిపడి ఉందంటోంది ఆధునిక సంఖ్యాశాస్త్రం. ఫ్లాట్‌ నెంబర్‌, పుట్టినరోజు, వాహనం నెంబరు, ఫోన్‌ నెంబరు,లైసెన్స్‌ నెంబర్‌ అన్నింటా మనకి సంఖ్యలతో సంబంధం ఉంది. అవి మనిషి మీద చూపే ప్రభావాన్నే న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) అంటున్నారు. గ్రీకు శాస్త్రజ్ఞుడు పైథాగరస్‌ న్యూమరాలజీని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందినప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా తెలుగు నాట న్యూమరాలజీ పాపులర్‌ అయింది. సెలబ్రెటీల నుండి సామాన్యుడి వరకు వారి దైనందిన జీవితంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 


నవగ్రహాలు తొమ్మిది. అలాగే సంఖ్యలు 9. ఈ తొమ్మిదితో మనిషి జీవిత విశేషాలు, వివాహం, భవిష్యత్‌, ఆరోగ్యమే కాక ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఎన్ని సంఖ్యలు ఉన్నా మొత్తం తొమ్మిదిలోపే వస్తాయి. సంఖ్యా శాస్త్రం ద్వారా మనిషి యొక్క భూత, వర్తమాన భవిష్యత్తుకు సంబంధించిన గుణగణాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి ఏ సంఖ్య కలసి వస్తుందో అంచనా వేయవచ్చు అంటారు న్యూమరాలజిస్టులు.  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో పోలింగ్‌ జరిగి, ఈ నెల 23న ఫలితాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో పార్టీల గెలుపు పై ముగ్గురు ప్రముఖ న్యూమరాలజిస్తులు అంకెల్లో ప్రధాన పార్టీల అభ్యర్దుల అదృష్టాన్ని విశ్లేషించారు. 

రేపటి ముఖ్యమంత్రి జగన్‌ 
'' చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు 20.4.1950 , జగన్మోహన రెడ్డి 21. 12..1972. వీళ్ల పుట్టిన తేదీల ప్రకారం పర్సనల్‌ ఇయర్‌ నెంబర్‌ '8'. ఈ సంఖ్య విజయానికి సూచిక. అత్యున్నత పదవులు పొంది,పేరు ప్రతిష్టలు అందుకుంటారు. వారి యొక్క పుట్టిన తేదీ, ఎన్నికల తేదీని న్యూమరాలజీ పరంగా పరిశీలించినపుడు వచ్చేది పర్సనల్‌ ఇయర్‌ నెంబర్‌. ఇద్దరిదీ ఒకటే పర్సనల్‌ నెంబర్‌ కాబట్టి వీరి మధ్య హోరా హోరీ గా పోటీ ఉంటుంది. కానీ, ఎడ్జ్‌ జగన్‌ వైపే ఉంది. ఎందుకంటే , సంఖ్యా శాస్త్రం ప్రకారం పొలింగ్‌ జరిగిన తరువాత చంద్రబాబు గారికి, కేవలం 10 రోజులే ఎనిమిదో నెంబర్‌ ఉంది. ఏప్రెల్‌ 20 తరువాత చంద్రబాబు పర్సనల్‌ ఇయర్‌ నెంబర్‌ 9కి మారింది. ఈ సంఖ్య ఎవరికి అనుకూలమైనది కాదు. బ్యాక్‌ టు వెవిలియన్‌ లాంటిది. దీనిని వైండింగ్‌ ఇయర్‌ అంటారు. ఆ విధంగా చంద్రబాబుకు సమస్యలు తప్పవు. 


ఇక జగన్‌ కి డిశంబర్‌ 21 వరకు ఇయర్‌ నెంబర్‌ '8' ఉంటుంది కాబట్టి ఆయన విజయ పథంలో ముందుకు సాగుతారు. అదృష్టం వరించి ప్రజాభిమానం చూరగొని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వారి పర్సనల్‌ ఇయర్‌ నెంబర్లను బట్టి, ఇతరుల నుండి సహాయం జగన్‌ కి 50 శాతం ఉంటే,చంద్రబాబుకి 29శాతం ఉంది.  2013 అక్టోబర్‌ 30 తేదీన చంద్రబాబు నాయుడు పేరులో 'నాయుడు' ని తీసేయమని సలహా ఇచ్చాను. పార్టీ పేరులో కూడా మార్పులు చేశాను.. దానిని వారు అనుసరించి విజయ పథంలో దూసుకు పోయారు. 


జగన్‌ పేరులో కూడా చిన్న సవరణ చేయాలి.దాని వల్ల మరింత సుపరిపాలన అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి పేరులో కూడా కొంత సవరణ అవసరం ఉంది. లేక పోతే అవి సకాలంలో పూర్తికావు, అనేక అడ్డంకులు ఎదువుతాయి..'' అన్నారు ప్రముఖ న్యూమరాలజిస్టు, పి.ఎస్‌. నెహ్రూ. ఈయన గతంలో మమతా బెనర్జీ,యడ్యూరప్పలకు కూడా న్యూమరాలజీ చెప్పానని నెహ్రూ అన్నారు. 


బాబు, జగన్‌ల భవిష్యత్‌ బాగుంది కానీ.... 
'' జగన్మోహన రెడ్డి 21. 12..1972 తెల్లవారు జామున 1.30కి పులివెందులలో పుట్టారు. దయా గుణం ఉన్నవాడు. ధర్మం, న్యాయం వైపు ఉంటాడు. అధ్యాత్మిక నమ్మకం ఎక్కువ. న్యూమరాలజీ ప్రకారం పర్సనల్‌ ఇయర్‌ నెంబర 8, ఈ సంఖ్య అధికారాన్ని సూచిస్తుంది. అతను నామినేషన్‌ వేసిన డేట్‌ కూడా అద్భుతంగా ఉంది. కానీ, కౌంటింగ్‌ డేట్‌ మాత్రం అంత యోగ్యంగా లేదు. అ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు 20.4.1950 న జన్మించారు. ఆయన పర్సనల్‌ ఇయర్‌ నెంబర్‌ కూడా 8. దీని వల్ల ఆయనకు అంతా మంచే జరుగుతుంది.ఆయనకు ఫెయిల్యూర్స్‌ కంటే విజయాలే ఎక్కువ. ఎన్నికలు జరిగిన తేదీ కూడా న్యూమరాలజీ ప్రకారం ఈయనకు అనుకూలంగా ఉంది.

అయితే కౌంటింగ్‌ డేట్‌ (23.5.2019) చంద్రబాబుకి కూడా అంతగా అనుకూలంగా లేదు. అయితే ఆంధ్రా భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, విభజన తరువాత ఏపీ ఫార్మేషన్‌ డే ను (2.6.2014) పరిగణలోకి తీసుకోవాలి. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర పర్సనల్‌ ఇయర్‌ నెంబర్‌ 1. ఈ నెంబర్‌ ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ ఎన్నికలలో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జగన్‌ సంతకం కంటే చంద్రబాబు సంతకంలో అభివృద్ధి పథం బాగుంటుంది. 


ఎన్నికల ఫలితాలు :
టీడీపీ,వైఎస్సార్‌సీపీ మధ్య 12 నుండి 15 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది.  అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే, గెలిచిన ఎమ్మెల్యేలు అధికారానికి దగ్గరగాఉన్న పార్టీలోకి దూకే అవకాశం ఉంది. ప్రధాన పార్టీ నాయకులు జాగ్రత్త పడటం మంచిది. '' అంటారు ఆస్ట్రో,న్యూమరాలజిస్టు, డా.ఎమ్‌.డి.దావూద్‌. 
 
చంద్రబాబుకే మళ్ళీ అధికారం..? 
'' పాలనాపరంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి వారసుడుగా, రెండో శాసనసభ ఎన్నికలను ఎదుర్కొన్న వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మరో పక్క పోటీపడుతున్నారు. 


నారా చంద్రబాబు పుట్టిన తేదీ ప్రకారం ,ఆయన జన్మ సంఖ్య - 2 (2 ం 0 ొ 2 ), మాస సంఖ్య - 4 (ఏప్రిల్‌ నెల సంఖ్య-4 ), సంవత్సర సంఖ్య - 6 (1 ం 9 ం5 ం0 ొ6 ). విధి సంఖ్య (డెస్టినీ )-6 , స్ట్రాంగ్‌ నెంబర్‌ -9 . ఈ ప్రకారం ఎన్నికల తేదియైన ఏప్రిల్‌ -11 (1 ం 1 ొ2 ) 2 సంఖ్య మరియు చంద్రబాబు జన్మ సంఖ్య -2 మరియు ఆయనకు అనుకూలం . ఎన్నికలు జరిగిన నెల సంఖ్య -4 , చంద్రబాబు పుట్టిన నెల సంఖ్య - 4 మరియు ఆయనకు అనుకూలం.ఎన్నికలు జరిగిన సమయంలో చంద్రబాబు వ్యక్తిగత సంవత్సరం (పర్సనల్‌ ఇయర్‌ ) - 8 . 8 సంఖ్య రాజకీయాలకు అనువైనది, చంద్రబాబు రాజకీయ జీవితానికి మంచిది. 


అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించే మే-23 ,మాత్రం చంద్రబాబు జన్మ సంఖ్య- 2 కు వ్యతిరేకం. .అదేవిధంగా మే -20 నుంచి చంద్రబాబుకి మంత్‌ స్ట్రాంగ్‌ నెంబరు - 5 వస్తుంది , ఇది బాబు పర్సనల్‌ ఇయర్‌ - 9 కి యాంటీ . సంఖ్యా శాస్త్ర ప్రకారం అతి తక్కువ మెజారిటీ మరియు అత్యంత తక్కువ సీట్లతో మళ్ళీ అధికారం పొందే అవకాశం కనబడుతోంది. 


ఇక వై.ఎస్‌. జగన్‌ పుట్టిన తేదీ ప్రకారం ఆయన జన్మ సంఖ్య - 4 (2 ం 2 ొ 4 ), మాస సంఖ్య - 3 (డిసెంబర్‌ నెల సంఖ్య-12 అనగా 1 ం2 ొ3 ), సంవత్సర సంఖ్య - 1 (1 ం 9 ం7 ం 2 ొ 19 ొ 1 ం 9 ొ1 ). విధి సంఖ్య (డెస్టినీ )- 8 , స్ట్రాంగ్‌ నెంబర్‌ - 3 . పర్సనల్‌ ఇయర్‌ - 9 . ఈ ప్రకారం ఎన్నికల తేదియైన ఏప్రిల్‌ -11 (1 ం 1 ొ2 ) 2 సంఖ్యకి జగన్‌ పర్సనల్‌ ఇయర్‌ -9 యాంటీ.అలాగే పర్సనల్‌ ఇయర్‌ -9 కి డెస్టినీ సంఖ్య -8 యాంటీ.ఎన్నికల ఫలితాల తేదీ 23 ( 5 ) కి పర్సనల్‌ ఇయర్‌-9 యాంటీ.స్ట్రాంగ్‌ నెంబరు మాత్రం అనుకూలంగా ఉంది.  అయితే జగన్‌ డెస్టినీ నెంబరు-8 . రాజకీయానికి చాలా మంచిది. ఊహించని పరిణామాలు జరిగితే అధికారం దక్కవచ్ఛు.'' అని వివరించారు, తొలి మహిళా సంఖ్యా శాస్త్ర వేత్త డాక్టర్‌ రైజల్‌ . (ఫోన్‌ నెంబర్‌ .9866 77 2626 ) 


విశ్వాసమే విజయం :
సంఖ్యల యొక్క ప్రభావం, కేవలం మనుషులపై మాత్రమే కాదు. అన్ని జీవుల మీద, సంస్థల మీద, స్థలాల మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద కూడా ఉంటుంది. ఆ రాష్ట్రం ఆవిష్కరణ దినం, ఆ దేశం పేరు, దాని నామ సంఖ్య ప్రకారం, ప్రభావం మారుతూ ఉంటుంది. అంటున్నారు న్యూమరాలజిస్టులు. 
 
రిపోర్ట్‌... శ్యాంమోహన్‌ 


మరింత సమాచారం తెలుసుకోండి: