చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సభ్యుడైన కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేయక తప్పని పరిస్దితులొచ్చాయి. ఉభయ సభలో ఎందులోను సభ్యుడు కాకపోవటంతోనే శ్రవణ్ రాజీనామా చేయక తప్పటం లేదు.  శ్రవణ్ ను మంత్రిని చేసిన చంద్రబాబు ఆరుమాసాల్లోగా ఏదో ఓ సభలో సభ్యుడిని చేయాలని తెలీదా ? తెలిసినా పట్టించుకోలేదు. అందుకనే ఇపుడు అవమానభారంతో శ్రవణ్ రాజీనామా చేయక తప్పని పరిస్దితిలొచ్చాయి. ఆరుమాసాల్లో అవకాశాలొచ్చినా శ్రవణ్ ను ఎంఎల్సీగా చేయలేదు.

  

ఇంతకీ విషయం ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఫిరాయింపు ఎంఎల్ఏ మావోయిస్టుల చేతిలో హతమయ్యారో వెంటనే  కొడుకు కిడారి శ్రవణ్ కుమార్ ను చంద్రబాబుమంత్రిని చేశారు. ఏ సభలో కూడా సభ్యుడుకానీ శ్రవణ్ ను చంద్రబాబు అర్జెంటుగా మంత్రిని ఎందుకు చేశారంటే ఓట్ల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

శ్రవణ్ ను మంత్రిని చేసిన చంద్రబాబు ఎంఎల్ఏగా కానీ ఎంఎల్సీగానీ చేయలేదు. దాని ఫలితంగా అవమానభారంతో శ్రవణ్ రాజీనామా చేయక తప్పటం లేదు.  గతంలో బావమరిది నందమూరి హరికృష్ణ విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. 1996లో రవాణాశాఖ మంత్రిని చేసి ఎంఎల్ఏగా చేయలేదు. దాంతో ఆరుమాసాల తర్వాత హరికృష్ణ రాజీనామా చేశారు.

 

ఇపుడు శ్రవణ్ విషయంలో కూడా చంద్రబాబు అలాగే వ్యవహరించారు. ఇదే విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు చంద్రబాబుకు గుర్తు చేశాయి. పోయిన నవంబర్ 11వ తేదీన మంత్రయిన శ్రవణ్  కు మే 11వ తేదీతో  ఆరుమాసాలు పూర్తవుతాయి. మొన్నటి ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుండి  శ్రవణ్ పోటీ చేశారులేండి. కానీ ఫలితాలు వచ్చేది 23వ తేదీన కదా ? అందుకనే మంత్రితో రాజీనామా చేయించమని రాజ్ భవన్ సూచించింది. దాంతో శ్రవణ్ రాజీనామా చేయక తప్పటం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: