ఏపీలో గ‌త నెల‌లో జ‌రిగిన అసెంబ్ల క‌మ్ పార్ల‌మెంటు ఎన్నిక‌లు అనేక అనుభ‌వాల‌ను మిగిల్చాయి. అత్యంత హోరా హోరీగా సాగిన ఈ ఎన్నిక‌ల‌ను ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు స‌వాలుగా తీసుకున్న విష‌యం తెలిసిందే. మ‌నుట‌యా? మ‌ర‌ణించుట‌యా? అన్న రేంజ్‌లో సాగిన ఈ ఎన్నిక‌ల పోరులో గెలుపు గుర్రం ఎక్కేందుకు పార్టీలు అభ్య‌ర్థులు కూడా చే యని జిమ్మిక్కు, వేయ‌ని ప్లాన్ కూడా లేవంటే అతిశ‌యోక్తి కాదు. ఎట్టిప‌రిస్థితిలో గెలిచి తీరాల‌ని ఇరు పార్టీల అధినేత‌, అభ్య‌ర్థులు కూడా గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు జోరుగా సాగాయి. నువ్వు ప‌ది ఖ‌ర్చుపెడితే.. నేను ఇర‌వై ఖ‌ర్చు పెడ‌తా! అంటూ అభ్య‌ర్తులు పోటీ ప‌డి మ‌రీ డ‌బ్బులు ఖ‌ర్చు చేశారు. 


ముఖ్యంగా అసెంబ్లీకి పోటీ చేసిన అభ్య‌ర్తులు మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించారు. వైసీపీ, టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు చేసిన ప్ర‌య‌త్నాల్లో కొన్ని తీపి జ్ఞాప‌కాల‌తోపాటు కొన్ని చేదు జ్ఞాప‌కాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థిని ఓడించేందుకు గాను చేతికి ఎముల లేకుండా ఖ‌ర్చ‌యితే . పెట్టారు కానీ, తీరా ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అలా ఖ‌ర్చు చేసిన‌ సొమ్మును త‌లుచుకుని కుళ్లి పోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేత‌ల్లో ఆవేద న అంతా ఇంతా కాదు. తాము ఖ‌ర్చు చేసేందుకు  త‌మ వ‌ద్ద ఉన్న‌దాంతో పాటు చాలా మొత్తం బ‌య‌ట అధిక వ‌డ్డీల‌కు కూడా తెచ్చుకున్నారు. 


ఇదే ఇప్పుడు వారికి పెను శాపంగా మారింది. ఉన్న‌ది అధికార‌పార్టీలో.. ఎన్నిక‌ల వేళ‌.. ఖ‌ర్చుకు ఎక్క‌డా వెనుకాడింది కూడా లేదు. అయితే, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చేందుకు ఇంకా స‌మ‌యం ఉంది. అస‌లు గెలిస్తే.. ఒకే కానీ, గెల‌వ‌క‌పోతే.. ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇదిలావుంటే, చేసిన అప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి దీంతో అస‌లును మించి పోక‌ముందే.. బాకీలు తీర్చుకుందామ‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలోని ఇద్ద‌రు కీల‌క మంత్రులు త‌ల‌కు మించిన భారానికి అప్పులు చేశార‌ని తెలుస్తోంది.

అయితే, ఇప్పుడు ఆ అప్పులు తీర్చ‌మ‌ని త‌మ‌పై ఒత్తిడి పెరిగింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో అప్పుల ఊబినుంచి బ‌య‌ట ప‌డేందుకు త‌మ అధీనంలోని హోట‌ళ్ల‌ను అమ్ముకునేందుకు ఆ అమాత్యులు సిద్ధ‌ప‌డ్డార‌ని అంటున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఎన్నిక‌ల వేళ ఎన్ని వంద‌ల కోట్లు చేతులు మారాయో ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: