కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతిపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే చంద్రబాబు, జగన్‌తో పాటు కేసీఆర్ కూడా కూటమిలో చేరుతారని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనిపై స్పందించిన విజయశాంతి.. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా చేరబోతోందని చెబితే, స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కు మేలు జరుగుతుంది`` అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.


అయితే, తాజాగా ఈ కామెంట్ల‌పై జ‌గ్గారెడ్డి మ‌ళ్లీ స్పందించారు. విజయశాంతి వ్యాఖ్యలపై నో కామెంట్ అంటూనే ఆమె గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజయశాంతికి పీసీసీ పదవి కావాలని కోరుకుంటున్నట్టున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువన్న ఆయన...చాలా మందికి సీఎం కావాలని కోరిక ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా... సొంత ఖర్చులతో పార్టీని నడిపించే వారు ముందుకు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని విజ‌య‌శాంతిపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. విజయశాంతి వల్ల పార్టీకే లాభం.. పార్టీతో ఆమెకి కూడా లాభమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఫుల్ టైం ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే... మంచి ఆదరణ ఉంటుందన్నారు.


పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ అప్పుల పాలు అయ్యార‌ని ఆరోపించారు. పార్టీ కోసం ఖర్చు చేశారు కాబట్టే ఆయనకు అప్పులయ్యాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్థికంగా తట్టుకోవాలి.. పదవి ఆశించకుండా పనిచేసేవారు పీసీసీ చీఫ్‌ అయితే  పార్టీకి లాభం అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా.. తాను సీఎం కావాలని ఎక్కడ పని చేయలేదని.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేశారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు బాధ్యత పీసీసీది కాదన్న జగ్గారెడ్డి... ఎమ్మెల్యేలు స్వలాభం కోసం పార్టీ మారని మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్లంతా...బలహీనతలతోనే వెళ్లారన్న ఆయన.. కొద్ది మంది నాయకులు... కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని చర్చ జరుగుతోందని హాట్ కామెంట్లు చేశారు. పార్టీ ప్రక్షాళనపై నా అభిప్రాయాలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: