ఏపీలో ఏ నోట విన్నా పీకే అన్న మాట వస్తోంది. ఈసారి ఎన్నికల్లో పీకే ఓ పాపురల్ పేరు అయిపోయింది. రాజకీయ పార్టీలన్నీ తమని తాము నమ్మకుండా పీకేను గట్టిగా నమ్ముకున్నాయి. మరి పీకే ఎవరి పక్షం. అధికారం ఎవరికి పీకి ఎవరికి ఇచ్చేస్తాడు అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది.


ఏపీలో టీడీపీది ఒక పీకే. అంటే పసుపు కుంకుమ, జనసేనకి ఏకంగా పీకే అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. వైసీపీకి మూడేళ్ల నుంచి పీకే అదే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. ఏపీలో వైసీపీకి ఇంత వూపు రావడానికి పీఅకే కారణమని తమ్ముళ్ళు ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారట. పీఅకే వ్యూహాలు అలా ఇలా లేవని తెలుసుకునేసరికి ఎన్నికలు జరిగిపోయాయి. ఫలితాలకు కూడా గడువు దగ్గరపడిపోయింది. 


ఇంతకీ వైసీపీ పీకే  ఆ పార్టీకి ఏం చేశాడంటే చాలానే చేశాడు అంటున్నారు తమ్ముళ్ళు. జగన్ కి ఒక్క చాన్స్ ఈ మాట జనంలో చర్చకు పెట్టడంలో ప్రశాంత కిసోర్ నూరు శాతం సక్సెస్ అయ్యాడని అంటున్నారు. అలాగే ఏపీలో  మార్పు రావాలి. బై బై బాబు, జగన్ వస్తేనే మేలు జరుగుతుంది..ఇలాంటి విషయాలను జనంలోకి ఓ వ్యూహం ప్రకారం తీసుకుపోవడంలో ప్రశాంత కిశోర్ విజయం సాధించారని తమ్ముళ్ళు ఇపుడు గ్రహిస్తున్నారుట.


నిజానికి చంద్రబాబు మీద అనుకున్న స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత లేకపోయినా వైసీపీ పీకే మాత్రం  గొప్ప వ్యూహాలను రచించి మరీ  ఏపీలో పొలిటికల్ గా  ఓ చేంజ్ ని తీసుకువచ్చేశారని, అదే రేపటి రోజున కొంపముంచబోతోందని తమ్ముళ్ళు కలవరపడుతున్నారు. మరి చూడాలి పీకే ప్రభావం ఏంటన్నది 23న రిజల్ట్స్ చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: