క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయ్.  రేపటి కౌంటింగ్ లో తెలుగుదేశంపార్టీ  తిరిగి అధికారంలోకి రావటం కష్టమనే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో జాతీయ స్ధాయిలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయం స్పష్టత కనిపించటం లేదు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పోషించేందుకు పెద్దగా పాత్ర కూడా కనిపించటం లేదు. దాంతో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసుకుపోతున్నట్లే ఉంది.

 

రేపటి ఎన్నికల్లో చంద్రబాబు గనుక ఓడిపోతే జాతయ స్ధాయిలో ఎవరూ పట్టించుకోరన్నది వాస్తవం. ఇపుడే జాతీయస్ధాయి నేతలెవరూ చంద్రబాబుపై పెద్దగా ఆధారపడుతున్నది లేదు. తమ రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా ప్రత్యేకంగా పిలవలేదట. కాకపోతే తానే వస్తానని చంద్రబాబు అంటే కాదనటం లేదని సమాచారం.

 

నిజానికి తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళి చంద్రబాబు చేయగలిగిందేమీ లేదు. పై రాష్ట్రాల్లో స్టాలిన్, శరద్ పవర్, మమతా బెనర్జీ లాంటి నేతలు బలమైన వారనటంలో సందేహం లేదు. ఏ విషయంలో కూడా వారెవరికీ చంద్రబాబుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రివర్సులో చంద్రబాబుకే పై నేతలపై ఆధారపడాల్సిన అవసరం చాలావుంది. అందుకనే తనంతట తానుగా వారితో అంటకాగుతున్నారు.

 

రేపటి కౌంటింగ్ లో గనుక టిడిపి ఓడిపోతే చంద్రబాబు భవిష్యత్ రాజకీయం భయంకరంగా ఉంటుందనటంలో సందేహాలు లేవు. కోర్టులో కేసులు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ళ అవినీతి పాలనలో కుంభకోణాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ చిన్న పథకం తీసుకున్నా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకున్నా భారీ కుంభకోణమే.

 

రేపటి ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఓ 10 ఎంపి సీట్లు కూడా గెలవకపోతే జాతీయ స్ధాయిలో ఇపుడున్న విలువ కూడా ఉండదు చంద్రబాబుకు. పైగా పై రాష్ట్రాల్లో నేతలెవరూ చంద్రబాబు చెబితే వినేవారెవరూ లేరు. ఏ విషయంలో కూడా పై నేతలను ఒప్పించలేరు, సమన్వయం కూడా చేయలేరు. కాబట్టి చంద్రబాబు గ్రాఫ్ పడిపోవటం ఖాయం. ఒకవైపు వయోభారం మరోవైపు ఎదురుదెబ్బలతో చంద్రబాబు రాజకీయాలకు జాతీయస్ధాయిలో  తలుపులు మూసుకుపోతున్నట్లే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: