మనదేశంలోని విపక్ష పార్టీలు సైతం ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బాలాకోట్ స్ట్రైక్‌కు సంబంధించి oka అంతర్జాతీయ విలేఖరి సంచలన కథనాన్ని ప్రచురించారు. ఐ ఏ ఎఫ్ ఎయిర్‌ స్ట్రైక్స్‌లో 130-170 మంది ఉగ్రవాదులు చనిపోయారని పేర్కొన్నారు.


ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 130-170 మంది (ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారితో కలిపి) ఉగ్రవాదులు చనిపోయారు. మృతుల్లో 11 మంది ట్రైనర్స్, బాంబులు తయారు చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఘటన తర్వాత జైష్-ఎ-మహమ్మద్ ప్రతినిధులు మృతుల కుటుంబాలను కలిసి భారీగా డబ్బు ఇచ్చారు. విషయం బయటపకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

Image result for Francesca marino journalist

అసలు బాలాకోట్‌లో ఎలాంటి నష్టం జరగలేదని ముందు నుంచీ బుకాయిస్తోంది పాకిస్తాన్. దాడి జరిగిన ప్రాంతానికి భారత జర్నలిస్టు లను కూడా అనుమతిస్తామని ఇటీవల వెల్లడించింది. ఆ ప్రకటన చేసిన వారం రోజులకే ఇటాలియన్ జర్నలిస్ట్ కథనం రాయడం విశేషం. మరి దీనిపై పాకిస్తాన్ సైన్యం ఎలా స్పందించబోతుందన్నది ప్రాదాన్యత  సంతరించుకొంది.


బీజేపీ సర్కార్‌ ప్రచారాస్త్రంగా మలుచుకున్న బాలాకోట్ వైమానిక దాడిపై న్యూటిస్ట్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 26 న భారత వాయుసేన జరిపిన దాడిని ఇటలీకి చెందిన జర్నలిస్ట్ తాజాగా ధ్రువీకరించారు. ఈ దాడిలో 130-170 మంది వరకు జైష్-ఎ- మహమ్మద్  ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ‘ఫ్రాన్సెస్కా మెరినో’ ఒక వివరణాత్మక కథనాన్ని “స్ట్రింజర్ ఏసియా' పత్రిక ద్వారా వెలువరించి  సంచలనం రేపారు.

Related image

పాకిస్తాన్‌ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాల ని చూస్తోందని ఆమె మండిపడ్డారు.  ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి  ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. అయితే భారత వైమానిక దళం జేఈఎం శిక్షణా శిబిరాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు.

Image result for Francesca marino journalist

బాలాకోట్‌ లోని ఉగ్రవాద శిబిరంలో జైష్-ఎ- మహమ్మద్  సంస్థ శిక్షణా శిబిరంలో జరిగిన  వైమానిక దాడిలో 170 మంది  చనిపోయారన్నారు. వీరిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు.  ఫిబ్రవరి 26న 3 నుంచి 4 గంటల సమయంలో భారత వైమానిక దళం దాడి ఘటన వెంటనే  షిన్‌కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందన్నారు. పాకిస్తాన్‌ సైన్యమే  క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి  ఆర్మీలోని  వైద్యుల ద్వారా  చికిత్స అందించిందని తెలిపారు. 

బాలాకోట్‌లో 170 మంది ఉగ్రవాదులు హతం..ఇటాలియన్ జర్నలిస్ట్ సంచలన కథనం

ఇప్పటికీ  గాయపడ్డ 45 మంది మిలిటరీ క్యాంపులో చికిత్స పొందుతున్నారని, వీరు ప్రస్తుతం సైన్యం నియంత్రణ లోనే ఉన్నారని ఆమె వెల్లడించారు అంతేకాదు దాడి లో చనిపోయిన తీవ్రవాదుల కుటుంబాలను సందర్శించిన  జెఈఎం నాయకులు సంఘటన గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చారని తెలిపారు.


కాగా సార్వత్రిక ఎన్నికల వేళ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటలీకి చెందిన జర్నలిస్టు కథనం ప్రాధాన్యతను సంతరించు కోనుంది. ప్రధానంగా విపక్షాలు బాల్‌కోట్‌ ఉదంతంపై విపక్షాలు  విమర్శలు గుప్పిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నతరుణంలో ఈ కథనం వెలువడటం గమనార్హం.

170 JeM terrorists killed in Balakot Airstrike Injured Treated by Pak Army says Italian journalist - Sakshi

బాలాకోట్‌లో దాడి జరిగిన ఆనవాళ్లను పాకిస్తాన్ సైన్యం మాయం చేసిందని మేరినో వెల్లడించారు. కొండ దిగువన నుంచి జైషే మహమ్మద్ క్యాంపుకు వెళ్లేదారిలో కొత్త సైన్ బోర్డులను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కొండపై ‘తలీమ్-ఉల్-ఖురాన్’ నడుస్తోందని సైన్ బోర్డుల్లో పేర్కొన్నారని, కానీ వైమానిక దాడులకు ముందు అలాంటివి ఏవీ అక్కడ లేవని వెల్లడించారు. జైష్-ఎ-మహమ్మద్  చీఫ్ మసూద్ అజర్‌ పేరిట భవనాల పేర్లు కనిపించేవని, ఇప్పుడు వాటిని తొలగించారని పేర్కొన్నారు. దాడులు జరిగిన ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉందని ఫ్రాన్సిస్కో మెరినో తన కథనంలో ప్రస్తావించారు. స్థానిక పోలీసులతో పాటు ఎవ్వరినీ కొండపైకి అనుమతించడం లేదని స్పష్టంచేశారు.

Image result for Francesca marino journalist

మరింత సమాచారం తెలుసుకోండి: