విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టం పరుచూరి భాస్కరరావు చివరి నిముషంలో ప్లేట్ ఫిరాయించారని వైసీపీ నేతలు ఆరోపిన్స్తున్నారు. పోలింగ్ తుది దశలో ఉందనగా ఆయన తమ ఓట్లన్నీ టీడీపీకే అంటూ కొత్త బాట పట్టారని సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. దీని వెనక చాల కధ నడించిందని  కూడా అంటున్నారు. నిజానికి పరుచూరికి మంత్రి గంటా చుట్టంగానే పేరు. ఆయన జీవితం మొత్తం మంత్రి చుట్టూనే తిరిగింది. ఇక మూడేళ్ళ క్రితం గంటాను వీడిన ఆయన సొంత రాజకీయ దుకాణం తెరిచారు. 


పరుచూరి టీడీపీతో సహా అన్ని పార్టీలు తిరిగేసి చివరికి జనసేన నుంచి పోటీ చేశారు. ఆయన దానికి ముందు కాంగ్రెస్ లో ఆర్భాటంగా చేరారు. అప్పట్లో తెలంగాణాలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ పరిణామాలతో ఏపీలో కూడా పొత్తు ఉంటే తాను తప్పక గెలుస్తానని అనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయింది దాంతో ఆయన కాంగ్రెస్ లో ఉండలేక వైసీపీ వైపుగా చూశారు. టికెట్ ఇస్తే గెలుచుకుని వస్తానని కూడా చెప్పారు. అయితే జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో పవన్ని ఆశ్రయించి జనసేనలో చేరిపోయారు.


ఇక జనసేన నుంచి పరుచూరి పోటీ వెనక కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన్ని బలంగా నిలబెట్టి కాపు ఓట్లను చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేయాలన్నది ఓ ప్లాన్ అని కూడా బయట ప్రచారం జరిగింది. అయితే పరుచూరి వేరే కులానికి చెందిన వారు కావడం, నాన్ లోకల్ అవడంతో ఆ పాచిక పారదని గ్రహించిన తరువాత కొద్ది ఓట్లు అయినా కలుస్తాయని లోపాయికారిగా టీడీపీకి మద్దతు ప్రకటింపచేశారని అంటారు. రెండు పార్టీలు ఒక్కటేనని వైసీపీని దెబ్బకొట్టడమే లక్ష్యమని కూడా వైసీపీ నేతలు ఇపుడు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని చెసినా తమ విజయం  ఖాయమని కూడా ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా పరుచూరి చేసిన మేలు ఏంటి. ఆయన వల్ల నిజంగా టీడీపీకి సహాయం లభించినా, లేక క్రాస్ జరిగిందా అన్న చర్చ ఇపుడు అనకాపల్లిలో జోరుగా సాగుతోంది.  టీడీపీ ఓట్లను కనుక చీల్చితే మాత్రం వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: