ఏపీ సీఎం చంద్రబాబు తన గుట్టును తానే బయటపెట్టుకుంటున్నారు.. మోడీ సర్కారు అన్నిరంగాల్లోనూ విఫలమైందని చెప్పేందుకు చేసిన ప్రయత్నాలతోనే తనను తాను అప్రదిష్టపాలు చేసుకుంటున్నారు. అది ఎలాగంటే.. మోడీ సర్కారుపై చంద్రబాబు విమర్శలను చూస్తేనే అర్థమవుతుంది. 


తాజాగా చంద్రబాబు మోడిని ఏమని విమర్శించారంటే... 
లక్ష కోట్ల బ్యాంకుల చీటింగ్ కుంభకోణాలు గత 5ఏళ్లలో జరిగాయి, నీరబ్ మోడి, చోక్సీ, విజయ్ మాల్యా వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పరార్ అయ్యారు. డిమానిటైజేషన్ పెద్ద కుంభకోణంగా మార్చారు. జిఎస్ టి సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యారు. 72ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇంత విఫల ప్రధానిని చూడలేదు.

45 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా హయ్యస్ట్ అనెంప్లాయిమెంట్ రేటుతో ఇండియా ఇప్పుడు సఫర్ అవుతోందని NSSO డేటా చెబుతోంది. ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ పొల్యూషన్ నగరాలు ఇండియాలో ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.

ఈ 30 ఏళ్లలో ఇప్పుడున్నంతగా ఇంత పెద్ద సంఖ్యలో సైనికుల మరణాలు గతంలో ఎప్పుడూ లేవని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. 80 ఏళ్లలో ఇప్పుడున్నంతగా ఆదాయ వ్యత్యాసాలు మరెప్పుడూ లేవని క్రెడిట్ సుసీ రిపోర్ట్ బయటపెట్టింది.

మహిళల విషయంలో ప్రస్తుతం వరల్డ్ వరస్ట్ కంట్రీ ఇండియానేనని థామస్ రాయటర్స్ సర్వే తెలిపింది. కశ్మీరీ యువత ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తీవ్రవాదం వైపు ఆకర్షితమవుతున్నట్టు ఇండియాన్ ఆర్మీ డేటా చెబుతోంది. 18 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ధరల పతనంతో భారతీయ రైతులు అవస్థలు పడుతున్నారని WPI రిపోర్టు చెబుతోంది. ప్రపంచంలో అసమానతలు పెరిగిన దేశంలో ఇండియా ముందుందని గ్లోబల్ వెల్త్ రిపోర్టు అనౌన్స్ చేసింది.

ఆసియా వరస్ట్ పెర్ఫామింగ్ కరెన్సీ ఏదంటే అది ఇండియన్ రూపీయేనని మార్కెట్ డేటా రిపోర్టు. పర్యావరణ పరిరక్షణలో వరల్డ్ థర్డ్ వరస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా అని EPI 2018 రిపోర్టు వెల్లడించింది. దేశంలో మొదటిసారి కరప్షన్ బాగా లీగలైజ్డ్ అయ్యినట్టు 2017 ఫైనాన్స్ బిల్ స్వయంగా ప్రకటించింది.

ఇలా చంద్రబాబు చేసిన ఆరోపణలు చాలా ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఈ అన్ని ఆరోపణల్లోనూ ఆయనకూ భాగం ఉంది. ఎందుకంటే... నాలుగేళ్లు చంద్రబాబు పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. పైన చెప్పిన లెక్కల్లో ఏవీ చివరి ఏడాదిలోనే జరిగినవి కాదు. కాబట్టి ఈ పాపాల్లో చంద్రబాబుకూ భాగం ఉన్నట్టేగా.. అది ఇది చంద్రబాబు నేర అంగీకార వాంగ్మూలం అన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: