ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారట. అదేంటి బాబుపై కోపమెందుకు అంటారా.. చంద్రబాబు తన బెంగాల్ పర్యటనలో చేసిన కొన్ని కామెంట్స్ కు రాహుల్ నొచ్చుకున్నారట. అంత మాట అంటారా అని ఫీలయ్యారట. 


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు.. మమతా బెనర్జీ ఇప్పటిదాకా బెంగాల్ టైగర్ గా పేరుపొందారని, ఆమె మరింత కీలక పాత్ర పోషిస్తారని, ఆమె దేశానికే పులి అవుతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల జాతీయ ప్రచారంలో భాగంగా పశ్చిమ బంగావ్ లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లాల్ గఢ్,  హాల్దియా బహిరంగ సభలో పాల్గొన్నారు. 

లోక్ సభ ఎన్నికల తర్వాత ఏర్పాడనున్న బీజేపీయేతర ప్రభుత్వంలో మమతాబెనర్జీ కీలకపాత్ర పోషించనున్నారని చెప్పారు.  మమతా బెనర్జీ బంగాల్ రాష్ట్రాన్నే కాదు..  దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. అంటే చంద్రబాబు మాటల అర్థం ఏంటి.. కాబోయే ప్రధానమంత్రి మమతా బెనర్జీ అనే కదా.. 

ఇక్కడే పాపం రాహుల్ నొచ్చుకున్నారట. మమతాను గెలిపించండి.. అంత వరకూ ఓకే కానీ.. ఆమే భారత పులి.. కాబోయే పీఎం అని అర్థం వచ్చేలా మాట్లాడటం రాహుల్ ను నొప్పించిందట. అయితే బెంగాల్ పర్యటన తర్వాత రాహుత్‌ భేటీ అయిన చంద్రబాబు ఈ విషయంపై తగిన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరి దానికి రాహుల్ ఎలా రియాక్టవుతారో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: