ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పటికే అనేక సర్వేలు చెప్పాయి. అన్ని సర్వేలు వైసీపీ వైపు మొగ్గడం మనం చూశాము. అయితే పోలింగ్ జ‌రిగిన నాటి నుండి టీడీపీ అధినేత త‌మ విజ‌యం ఖాయ‌మ‌ని చెబుతుంటే..మంత్రులు..అభ్య‌ర్దుల్లో మాత్రం ఆ స్థాయి ధీమా క‌నిపించ‌టం లేదు. అయితే, ఇప్ప‌టికే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ నేరుగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన స్పందించ‌లేదు.


కానీ, తిరుమ‌ల‌లో స్పందించిన స‌మ‌యంలోనూ..అదే విధంగా అమెరికాలో జ‌రిగిన టీడీపీ ఎన్నారైల స‌మావేశంలోనూ ల‌గ‌డ‌పాటి ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. ఏపీ ప్ర‌జ‌లు సంక్షేమానికి..అభివృద్దికి ప‌ట్టం క‌ట్టారంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇదే స‌మ‌యంలో ఒపీనియ‌న్ పోల్ నిర్వ‌హించిన ఆయ‌న టీం.. ఎన్నిక‌ల త‌రువాత పోస్ట్ పోల్ స‌ర్వే సైతం నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం.


ఇందులో హోరా హోరీ పోరు జ‌రుగుతున్న స్థానాల పైన ప్ర‌త్యేక దృష్టి సారించారు. దీంతో..లోతుగా స‌ర్వే చేయిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందు కోసం ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల నాడి తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలోని 175 స్థానాల్లో టీడీపీ..వైసీపీ నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల‌ప‌డుతున్న నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 40 వ‌రకు ఉన్న‌ట్లుగా గుర్తించారు. అక్క‌డ ఎవ‌రు గెలిచినా మెజార్టీ స్వ‌ల్పంగా ఉంటుంద‌ని తేల్చారు. అయితే, ఆ 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో మెజార్టీ స్థానాలు ఎవ‌రైతే గెలుస్తారో వారికే అధికారం ద‌క్కుతుంద‌ని గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: