చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంల మీద నెట్టెయ్యడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి నుంచే దానికి తగట్టు ఎలక్షన్ కమిషన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. అవును.. రాబోయే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఓడిపోతే అది ఆయన తప్పుకాదట. ప్రజా వ్యతిరేకత అస్సలు లేదట. కేవలం ఈవీఎంలలో లోపాల వల్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందట.


ఈ విధమైన ప్రచారాన్ని ఇప్పట్నుంచే షురూ చేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు బాబు. ఈ దురాలోచనతోనే బాబు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు వైసీపీనేత అంబటి రాంబాబు. "తన ఓటమికి ఈవీఎంలదే బాధ్యత అనే అంశాన్ని ఒక దురుద్దేశంతో దేశవ్యాప్తంగా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. తాను ఓడిపోతే, అది తన పరిపాలన తప్పుకాదని, ప్రజలు తనను వ్యతిరేకించలేదని, కేవలం ఈవీఎంల వల్ల మాత్రమే ఓడిపోయామనే మాటను వ్యాప్తిచేయడం కోసం బాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు."


బాబు చేస్తున్న ఈ పనిని అత్యంత దుర్మార్గమైన ఆలోచనగా అభివర్ణించారు అంబటి. ఇప్పటికైనా చంద్రబాబు వ్యవస్థల్ని గౌరవించాలని కోరారు. మరోవైపు తను సైకిల్ గుర్తుపై ఓటేస్తే అది ఫ్యాన్ గుర్తుకు పడిందంటూ బాబు చేసిన ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. అత్యున్నత న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: