ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చక్రాలకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. చక్రం ఆయన చేతికి రావాలి. లేకపోతే ఆయనే వెతుక్కుంటూ చక్రం కోసం ఎందాకైనా వెళ్తారు. ఇపుడు చంద్రబాబుకు చాలా అవసరాలు చక్రాలతో ఉన్నాయి. తన రాజకీయ ప్రత్యర్ధులని చేదించడానికి, తనకు పనికొచ్చే వారిని అందలం ఎక్కించడానికి చక్రం ఎంతో ముఖ్య. అందుకే బాబు గారు చక్రాన్ని పరుగులు తీయిస్తున్నారు
.


డిల్లీలో రాహుల్ గాంధీని కలసిన బాబు మీరే గెలుస్తారంటూ ఓ సర్వే చేతిలో పెట్టారట. బీజేపీ కంటే ఓ నలభై ఎంపీ సీట్లు తక్కువ పడినా మీరే కాబోయే పీఎం అంటూ బాగానే ఆశలు కల్పించారని సమాచారం. దాంతో షాక్ తినడం రాహుల్ వంతు అయిందంట... కాంగ్రెస్ కి మద్దతుగా మిగిలిన పార్టీలను తీసుకువచ్చే పనిలో బాబు ఇపుడు తెగ బిజీ అయిపోయారు. తానే ప్రధాని అంటున్న కలకత్తా కాళిక మమతతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నెల 18న ఉత్తర ప్రదేశ్ వెళ్ళి మరీ అఖిలేష్, మాయావతితో చర్చలు జరుగుతారట.


మొత్తానికి అందరికీ ఒకే త్రాటిపైకి తీసుకువచ్చి రాహుల్ ని ప్రధాని చేయాలని బాబు తాపత్రయంగా కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఏపీలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో బాబు గారు చూసుకున్నట్లుగా లేదని అంటున్నారు. మరి బాబు మెజారిటీ సీట్లు గెలుచుకోకపోతే  డిల్లీలో ఆయనకు విలువ ఉంటుందా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇక మమతా, మాయావతి వంటి వారు కచ్చితంగా బాబు కంటే ఎక్కువ సీట్లు  తెచ్చుకుంటారు. వారు మరి బాబు మాట వింటారా. రాహుల్ బాబాకు జై అంటారా చూడాలి. మొత్తానికి బాబు ఎన్నికలకు ముందే చక్త్రధారి అయిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: