ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలుబొమ్మ: నరేంద్ర మోదీ చెప్పిందల్లా చేయటమే తప్ప, ఎన్నికల సంఘానికి స్వతంత్రత అనేదే లేదా?  మోదీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంటే ఈసీ అందులో భాగమవుతుందా?  స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మ చేసి ప్రధాని నరేంద్ర మోదీ ఆడిస్తున్నారు. ఆయన ఆడమన్నట్టల్లా ఆడుతున్న వ్యవస్థల్ని చూసి దేశం తలొంచుకుంటోంది. ఇదీ టిడిపి అధినేత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిన్న పశ్చిమ బెంగాల్లో ప్రవచనం. జార్‌గ్రామ్‌, హాల్దియాల్లో జరిగిన బహిరంగ సభల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
Image result for chandrababu mamata banerjee narendra modi
వీరంతా చంద్రబాబు లెక్క ప్రకారం ప్రజాస్వామ్య వాదులు? 

కేంద్రంలో మరల బిజేపి అధికారంలోకి వచ్చే ప్రశక్తి లేదని  చంద్రబాబు ఉటంకించారు. అధికారంలోకి రానున్న బాజపా ఏతర కూటమి ప్రభుత్వం లో మమత బెనర్జీదే కీలక భూమిక: దేశంలో సీనియర్‌ రాజకీయ నాయకులందరం కలిసి "మోదీ-అమిత్‌-షా" ల నిరంకుశ పాలనపై పోరాడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించేందుకే మా పోరాటం.  42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌ తీర్పు ఇప్పుడు దేశానికి అత్యంత కీలకం. నియంతలా వ్యవహరిస్తున్న మోదీ కావాలో? మీలో ఒకరిగా మీ సేవకురాలిగా ఉన్న దీదీ కావాలో? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌సభ స్థానాలున్నాయి. తెలుగు ప్రజలు ఒకటిగా ఉంటే దేశ రాజకీయాలను శాసిస్తారనే కుట్రతో రాష్ట్రాన్ని విభజించారు (ఎవరు విభజించారు బిజేపి మోడీనా? నేటి నీ ప్రాణ మిత్రుడు రాహుల్ గాంధి ఆయన మాతృమూర్తి కాంగ్రెస్ నాటి అధినేత్రి సోనియా గాంధినా? ఎందుకు ఇలాటి వంకర మాటలు - డెబ్భైయేళ్ళ వయసులో ఉన్న మీకు ఇలా మాట్లాడటం సిగ్గని పించట్లేదా? అసలు మీరు అంటే 'టిడిపి లేఖ' ఇచ్చాకే విభజన ప్రక్రియ మొదలైంది. "ఏ ఇంటికి పోతే ఆయింటి మాటలు మాట్లాడే యాచక" పలుకులు ఎందుకు? అధికారం లేకపోతే బ్రతకలేమా?) 

ఇప్పుడు బెంగాల్‌ లోనూ అదే తరహా కుట్ర జరుగుతోంది. ఉత్తర భారత దేశం లోనూ, హిందీ రాష్ట్రాల్లోనూ భాజపా ఆటలు సాగటం లేదు. అందుకే మతం ముసుగులో బాజపా పశ్చిమ బెంగాల్‌ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.- అంతా బాగానే ఉందే! బాజపా మతం కోసం ఆ ముసుగులో పని చేస్తుంటే సరే! మీ సంగతేమిటి 
గత ఐదేళ్ళలో మీకు అనుయాయి కాని ఒక కమ్మేతర సాధారణ పౌరుడు ఏపిలో ఎదైనా చిన్న ప్రయోజనం పొందాడా?
Image result for chandrababu naidu caste madness
*గుత్తేదార్లంతా నీవాళ్ళే కదా!
*మీడియా లో అగ్రభాగం అనేకంటే సింహభాగం మీవాళ్లకే ఇచ్చారు గదా!
*సినీరంగంలో అగ్ర భాగం, మొన్న చిరంజీవి వచ్చేవరకు కమ్మ కాని చీమ కు కూడా సందివ్వలేదు కదా! 
*వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ట్రాన్స్పోర్ట్, ఇసుక, కాల్-మనీ ఇందు గలదు అందులేని కమ్మదనం ఎముందో చెప్పండి? ప్రభుత్వం నుండి జరిగిన భూ *పందేరాలన్నీ కమ్మ వారంతా మింగాకే కదా! మిగిలితే  మీ అనుయాయీలకు ఇచ్చారు కదా!
Image result for chandrababu naidu caste madness
బిజేపిది మతం కనీసం ముసుగు! మరి మీది మొత్తం ఏ ముసుగూ లేని కుల దిగంబరమే! బహిరంగమే కదా!  కాదా!    
నరేంద్ర మోడీ నియంత అన్నారు చంద్రబాబు. సరే! అలాగే అనుకుందాం! అసలు ఈ దేశంలో అటు అధికారాలు వెలగబెట్టిన కాంగ్రెస్ గాని రాష్ట్రాల్లో అధికారాలు వెలగ బెడుతున్న ప్రాంతీయ పార్టీలు గాని ప్రజాస్వామ్య పాలన చేస్తున్నాయా?

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటి వరకూ బెంగాల్‌ టైగర్‌ గానే పేరుపొందారని, రాబోయే భాజపాయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషించి దేశానికే బెబ్బులి అవుతారని వ్యాఖ్యానించారు. ఇది కూడా బాగానే ఉంది - మొన్నీ మద్య శరద్ పవార్ తో ప్రధాన మంత్రులు జాబితాలో మీ పేరు చేర్పించు కున్నారు కదా!  ఒకవేళ మీకు కాలం కలసి వచ్చి మమత బెనర్జీ తో పోటీ వస్తే - అప్పుడు ఆమెను బెంగాల్ టైగర్ కాదు కదా! బెంగాల్ నక్క అనటానికి మీరేమీ సంకోచించ రని మమత బెనర్జీకి కూడా తెలుసు.


మీరు బెంగాల్ వెళ్ళి మమతను గెలిపించమని ప్రచారం చేశారు. మీకు వేరే ఆప్షణ్ లేదు. కాని ఆమె ఏపికి వచ్చి ప్రచారంలో మోడీని ఓడించమని చెప్పారే! గాని, మిమ్మల్ని గెలిపించమని కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు. మీ జాతకం ఆమెకు తెలుసు కాబట్టే ముందు నుంచీ ఆమె జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే మోడీతో మీ నాలుగేళ్ళ 'జిగినీ దోస్తీ'  ఆమె గమనిస్తూనే ఉన్నారు ఆమె.  ఇంటెలిన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మీ లీలామృతాన్ని ఆమెకు  చేరవేస్తూనే ఉందట. రాజకీయంగా తప్పని పరిస్థితు లేర్పడితే మిమ్మల్ని మోడీని ఇద్దరిలో ఒక్కరిని ఎన్నుకోవలసి వస్తే ఆమె తొలి ఎంపిక నరేంద్ర మోడీనే కాని మీరు మాత్రం కాదు. 


భాజపాకు చోటిస్తే మత విద్వేషాలకు ఆజ్యం పోసినట్టే: మరి గత నాలుగేళ్ళ వరకు ఈ విషయాన్ని ఖండిస్తూవచ్చిన మీ నోటిని నోరు కాదు అదేదో అంటున్నారు మీ గురించి అర్ధం చేసుకున్న తెలుగు ప్రజలు. మీ కెలాగైతే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందో, ఉభయ రాష్ట్రాల తెలుగుప్రజలు కూడా మిమ్మల్ని అర్ధం చేసుకోవటంలో నలభై సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పండిపోయారు సుమా! 

Image result for MLA jumpings from YCP to TDP

Image result for MLA jumpings from YCP to TDPవ్యవస్థల్ని కూల్చివేయటంలో మీ ముందు నరేంద్ర మోడీ మరుగుజ్జు మీరు ఆయన ముందు ఎవరెస్ట్. ఎందుకంటే ఓటు కు నోటు కేసుతో తెలంగాణా ప్రజల్ని మోసం చేయబోయి బొక్కబోర్లా పడ్డారు. మీరు ఏపిలో శాసనసభ్యుల పిరాయింపులు ప్రొత్సహించి ప్రతిపక్షాన్ని నిర్వీర్ఫ్యం చేసి ప్రజాస్వామ్య హతకులయ్యారు. అంటే రాజ్యాంగ వ్యవస్థ అయిన శాసన నిర్మాణ వ్యవస్థకు మీరే మూలంలో చెదలు పట్త్టించారు. 
Image result for anil chandra punetha and LV subrahmanyam
రాజ్యాంగ వ్యవస్థల్లో రెండవది శాసనాలను అమలు పరచే ఎక్జెక్యూటివ్ లేదా అధికార వ్యవస్థను మీరు పుట్టి ముంచ బట్టే కదా! మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బదిలీ అయి, ఆయన స్థానంలో మిమ్మల్ని ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్న చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వచ్చారు కదా! ఇంకా ఇంటెలిజెన్స్ హెడ్ ఏబి వెంకటేశ్వరరావు అధికార బాధ్యతలు వదలి పెట్టి మీ రాజకీయ బాధ్యతలు చూడటం మొదలెట్టగానే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పుట్టి మునిగింది కదా! ఆయన కూడా ఇప్పుడు సెలవులో వెళ్ళిపోయారు. ఏపి కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ అధారిటీ కమీషనర్ గా ఉన్న నాగులపల్లి శ్రీకాంత్ బాబుకు సహకరించకపోవటంతో డా. చెరుకూరి శ్రీధర్ తన కులానికే చెందిన వ్యక్తిని ఆ స్థానంలోకి తెచ్చారు కదా! ఇలా కులపిచ్చి కంటే బాజపా మత పిచ్చి విశాలమైనది విస్తృతమైనది కదా! 
Image result for many stays on cases against chandrababu
రాజ్యాంగ వ్యవస్థలో మూడవది న్యాయవ్యవస్థ దీని మీరు మానేజ్ చేసిన తీరుకు జస్టిస్ ఈశ్వరయ్య చాలా సవిస్తరంగా వివరించారు. సాక్ష్యం మీరు మీపై వచ్చిన ఆభియోగాలపై పదుల సంఖ్యలో విచారణల పై తెచ్చుకున్న నిలిపివేతలు (స్టేలు) చాలు. ఎక్కువ అక్కరలేదు.  

Image result for many stays on cases against chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: