తెలంగాణ నుంచి పొట్ట‌కూటి కోసం గ‌ల్ఫ్ దేశానికి వెళ్లిన క‌రీంన‌గ‌ర్ వాసి న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నాడు. కుటుంబంతో పాటు అబుదాబిలో ఏడారిలో ఉంటున్నాడు. బ‌త‌క‌లేక‌, చావ‌లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డేయాలంటూ త‌న గోస‌ను చెప్పుకుంటూ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


రెండేళ్ల కింద బ‌తుకుదెరువు కోసం వెళ్లిన వీర‌య్య అక్క‌డ ఓ వ్య‌క్తి ద‌గ్గ‌ర ప‌నికి కుదిరాడు. ఎడారిలో వంద ఒంటెల‌ను నెనొక్క‌డినే కాయాలి సార్‌.. స‌రిగా అన్నం లేదు.. ఉండ‌టానికి ఇళ్లు లేదు. క‌రెంట్ లేని ప్ర‌దేశంలో క‌ష్టంగా బ‌తుకుతున్నాం. ఏం చెయ్యాలి సార్‌.. బానిస‌ల క‌న్న అధ్వానంగా చూస్తున్నారు సార్‌.. కొడుతున్నారు సార్‌.. న‌న్ను ఏం చేయ‌మంటారు సార్‌.. న‌న్ను ఇండియా వ‌చ్చేందుకు సాయం చేయండి సార్ అంటూ త‌న ఆవేద‌న చెప్పుకున్నాడు. 


ఈ వీడియోను ఓ నెటిజ‌న్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ టీఆర్ెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో కేటీఆర్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్ కు ట్విట్ట‌ర్ లో స‌మాచారం అందించారు. అత‌డిని ఎలాగైనా భార‌త్‌కు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా కోరారు కేటీఆర్‌. 


క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ మండ‌లం మ‌క్తాప‌ల్లికి చెందిన పాలేటి వీర‌య్య. 2017లో అబుదాబి వెళ్లాడు. సౌదీ అరేబియా జోర్డాన్ స‌రిహ‌ద్దులో ఒంటెల క్షేత్రంలో ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల వీర‌య్య త‌ల్లి అనారోగ్యంతో చ‌నిపోయింది. త‌ల‌కొరివి పెట్టేందుకు కూడా వీర‌య్య‌ను పంపించ‌లేదు ఒంటెల య‌జ‌మాని. ప్పుడు ఈ విష‌యాన్ని వాళ్ల బంధువులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎవ‌రు ప‌ట్టించుకోలేదు. దీంతో వీర‌య్య అక్క‌డి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించి పోలీసుల‌కు చిక్కాడు. ఇంకేముంది మ‌ళ్లీ ఆ య‌జ‌మాని వ‌ద్ద‌కు తీసుకెళ్లి వ‌దిలారు పోలీసులు. 


ఇటు మ‌రోవైపు వీర‌య్య‌ను ఎలాగైనా ఇండియా తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరుతున్నారు బాధితుడి కుటుంబ స‌భ్యులు. ప‌ది ఇర‌వై రోజుల నుంచి ఫోన్ కాంట‌క్ట్ లో కూడా లేడ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చ‌స్తున్నారు. అయితే వీర‌య్య భార్య, ఇద్ద‌రు కుమారులు, వాళ్ల కుటుంబ స‌భ్యులు మ‌క్తాప‌ల్లెలోనే ఉంటున్నారు. అప్పుల భారం కావ‌డంతో అబుదాబి వెళ్లాడ‌ని చెప్పారు. మంచి ప‌ని ఇప్పిస్తామ‌ని మ‌ధ్య ఏజెంట్స్ త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని వాపోతున్నారు. ఇప్ప‌టికైనా కేంద్ర‌, రాష్ట్ర ప‌భుత్వాలు వీర‌య్య‌ను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేలా కృషి చేయాల‌ని బాధితుడి కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: