Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

ఇది లేడీ డ్రంక్ & డ్రైవ్

ఇది లేడీ డ్రంక్ & డ్రైవ్
ఇది లేడీ డ్రంక్ & డ్రైవ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వీకెండ్ వచ్చిందంటే చాలు మందుబాబుల దురాగతాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ట్రాఫిక్ పోలిసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీళ్ళలో మార్పు రావట్లేదు. బంజారహిల్స్లోని ఏపీ12కె 4444 కారుకు ప్రమాదం జరిగింది. ఫుల్లుగా డ్రింక్ చేసి కారు నడిపారని తెలుస్తోంది. బంజారహిల్స్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. 


నాగార్జున కంస్ట్రక్షన్కు చెందిన ఈ కారు యొక్క నెంబర్ ఫ్లేట్స్ కూడా యాక్సిడెంట్ తరువాత తొలగించారు. కారు లెఫ్ట్ టైర్ పగిలిపోగా ఎయిర్ బ్యాగ్స్ సహాయంతో వారు బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. కారు లోపల మందు బాటిల్లు కూడా ఉన్నాయని ఒక యువతి డ్రైవింగ్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తుంది. 


కానీ పోలీసుల నుండి చెబుతున్న సమాచారం ఇందుకు మొత్తం విరుధ్ధంగా ఉంది. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని అతను పోలీస్ స్టేషన్ లొంగిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఇది పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నమో ఇదే నిజమో తెలియాలంటే దర్పాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడాలి. 


drunk-and-drive
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

While working on my book Process: The Writing Lives of Great Authors, I found that even for the best writers in the world, getting started can be the hardest part.