జాతీయ రాజకీయాల్లో కూడా బాబు చక్రం తిప్పుతాడని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న హడావిడి అంత ఇంతా కాదు. కానీ వాస్తవంగా పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. రేపు ఎన్నికల్లో బాబు ఘోరంగా ఓడిపోతే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబును ఎవరు పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం బాబుతో రాసుకుపూసుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ పై ఓ కన్నేసి ఉంచిందంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి హస్తం పార్టీ ఇస్తున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.


ఈసారి ఎన్నికల్లో జగన్ కు అత్యధిక ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ను ఆకర్షిస్తున్న అంశం ఇదే. రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే జగన్ తో చేతులు కలపడానికి కాంగ్రెస్ ఏమాత్రం మొహమాటపడదు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తమవాడే అనే అంశాన్ని కూడా ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


అదే సమయంలో, చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టడానికి కూడా వెనకాడదు. అదేకనుక జరిగితే బాబుకు తన జీవితంలో అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంత నష్టంచేయాలో అంతా చేశారు బాబు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయంలో కూడా బాబు చేతిలో భంగపడ్డానికి కాంగ్రెస్ సిద్ధంగాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: