న‌గ‌రంలో డెబిడ్ కార్డు క్లోనింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయ‌కుల ఖాతాల‌ను దోచేస్తున్నాయి. డెబిట్ కార్డు ఎంక్వైరీ అని.. ఆర్బీఐ నుంచి వ‌చ్చిన బ్యాంక ్‌ఖాతాలను దోచేస్తున్నాయి. డెబిట్ కార్డు ఎంక్వైరీ అని ఆర్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని చెప్పే వ్య‌క్తుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌ర్ నిపుణులు సూచిస్తున్నారు. 


హైద‌రాబాద్‌లో బ్యాంక్ డెబిట్ కార్డుల క్లోనింగ్ ముఠాల ఆగ‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అబాయ‌కుల బ్యాంక్ ఖాతా వివ‌రాలు సేక‌రించి డ‌బ్బులు కాజేస్తున్నారు. ప్ర‌తిరోజు రెండు నుంచి మూడు వ‌ర‌కు ఇలాంటి కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.


పాత కార్డుల‌ను తీసుకుని కార్డు రీడ‌ర్ అనే ఇక్విమ్ మెంట్‌తో క్లోనింగ్ చేస్తారు. అప్ప‌టికే ఐవీఆర్ నెంబ‌ర్ నుంచి సేక‌రించిన పిన్ నెంబ‌ర్‌తో సుల‌భంగా డ‌బ్బులు కాజేస్తున్నారు. తాము ఫ‌లానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ డెబిట్ కార్డు రెన్యూవ‌ల్ చేసుకోవాల‌ని అంటారు. న‌మ్మి వివ‌రాలు చెబితే అంతే.. ఖాతా నుంచి డ‌బ్బులు మాయం..


అంతేకాదు డూప్లికేట్ డెబిట్ కార్డుల‌ను సృష్టించి కూడా డ‌బ్బులు కాజేస్తున్నారు. ప్ర‌కాశ్ అన ఏఆర్మీ అధికారికి ఆర్‌బిఐ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని మాట్లాడారు. మీ కార్డు గ‌డువు తీరిపోయింది. రెన్యూ వ‌ల్ చేయించుకోవాల‌ని చెప్పారు. కార్డు నెంబ‌ర్ చెప్పాల‌ని కోరారు. మీ ఫోన్ కు వ‌చ్చే otp వివ‌రాలు కావాల‌ని కూడా అడుగుతారు. ప్ర‌కాశ్ వివ‌రాలు చెప్ప‌గానే ఆయ‌న ఖాతా నుంచి డ‌బ్బులు కాజేశారు. మ‌ళ్లీ ఫోన్ చేస్తే ఆయ‌న‌పై దుర్భ‌షలాడుతున్నారు. ఈ త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై సీసీఎస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు బాధితుడు . 


బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ విష‌యంంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంక్ ఖాతా వివ‌రాలు ఫోన్లో ఎవ‌రు అడిగినా క్రాక‌స్ చెక్ చేసుకోవాల‌ని కోరుతున్నారు. వాస్త‌వానికి బ్యాంక్ ఖాతా నెంబ‌ర్ చెప్పాల‌ని ఏ బ్యాంక్ నుంచి ఫోన్లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. 


మొత్తాని ఈ ర‌క‌మైన మోసాలు రోజుకు రెండు మూడు త‌మ దృష్టికి వ‌స్తున్నాయ‌ని సైబ‌ర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ప్ర‌జ‌ల్లో దీనిపై అవ‌గాహ‌నం మ‌రింత పెర‌గాల‌ని అన్నారు. ఓటీపీ, డెబిట్ కార్డు వివ‌రాలు ఎవ‌రితో షేర్ చేసుకోరాద‌ని మ‌రోసారి సూచిస్తున్నారు. మీ ఎకౌంట్ కు సంబంధించిన డీటేల్స్ బ్యాంక్ అధికారులు ఎవ‌రు అడ‌గ‌ర‌ని వెల్ల‌డించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: