గురువారం ఉదయం నుంచి మీడయాలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పేరు మారుమోగిపోయింది. రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల టీవీ నైన్‌ ను మైహోం గ్రూపు అధినేత కొన్న నేపథ్యంలో ఛానల్లో అంతర్గత గొడవలు ఉన్నాయని కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 


పోలీసులు కూడా ఫిర్యాదును ధ్రువీకరించడంతో మీడియాలో రవి ప్రకాశ్ ఫోర్జరీ కేసు విషయం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఛానళ్లు, వెబ్ సైట్లు ఎప్పటికప్పుడు హాట్  హాట్ గా వార్తలు అందించాయి. దీంతో అంతా రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని భావించారు. 

ఇదే సమయంలో టీవీ నైన్ సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇక ఈ కేసు గురించి పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సాయంత్రానికి కూడా విషయం కొలిక్కి రాలేదు. సరిగ్గా రాత్రి ఏడు గంటల వేళ టీవీనైన్ తెరపై హఠాత్తుగా రవిప్రకాశ్ కనిపించారు. 

తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని.. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. అరెస్టు చేయబోరని తెలిపారు. తానే టీవీ నైన్ సీఈవోను అని చెప్పిన రవిప్రకాశ్.. సీఈవోగానే మాట్లాడుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అవాక్కవ్వడం జనం వంతైంది. యాజమాన్యం తొలగించామని చెప్పినా.. రవిప్రకాశ్ ఎలా లైవ్ లోకి వచ్చాడు. ఇంతకీ ఆయన సీఈవోనా కాదా.. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి?


మరింత సమాచారం తెలుసుకోండి: