చాలా ముందుగా ఎన్నికలు జరగడం కాదు కానీ ఇపుడు అభ్యర్ధుల మధ్య రాజకీయ గొడవలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. మెజారిటీల విషయంలో నేరుగా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటూ రెచ్చగొట్టే ధోరణిలో నాయకులు  ముందుకు సాగుతున్నారు. ఫలితాల ప్రకటనకు  సమయం ఉంది. ఎవరైనా నేను గెలుస్తానని చెప్పుకోవడం వరకూ ఒకే. కానీ అవతల వారు దారుణంగా ఓడిపోతారని కూడా శాపాలు పెడుతున్నారు. దీంతోనే అసలు గొడవ వస్తోంది. ఇక మెజారిటీల గురించి కూడా రచ్చ చేసుకుంటున్నారు. గెలిపించినా ఓడించినా ప్రజలు అన్న సంగతిని మరచిపోతున్నారు. దాంతో పోలింగ్ అనంతర  రాజకీయ వేడి ఎక్కడికి దారితీస్తుందోనని పోలీస్ వర్గాలు సైతం బెదరాల్సివస్తోంది.



ఇది రాజు గారి మాట. విశాఖ రూరల్ జిల్లా ఎలమంచిలి నుంచి ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్న కన్నబాబు రాజు తన గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ఆయన తొలిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్సార్ వేవ్ లో గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోతారనుకుంటే అనూహ్యంగా మళ్ళీ గెలిచి రికార్డ్ బ్రేక్ చేశారు. ఇక 2014 ఎన్నికల నాటికి ఆయనకు టికెట్ రాలేదు. కానీ టీడీపీ అభ్యర్ధి విజయానికి క్రుషి చేశారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్తితుల్లోనూ పదివేల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తానని చెప్పుకొచ్చారు.



అయితే ఈ విషయంపై ప్రత్యర్ధి, టీడీపీ అభ్యర్ధి అయిన పంచకర్ల రమేష్ బాబు కౌంటర్ వేశారు. పది వేలు కాదు కదా పది ఓట్లు మెజారిటీ కూడా  ఆయనకు రాద‌ని రమేష్ బాబు అనడంతో రాజు గారికి ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకుంది. అంతే పది కాదు, ఇరవై వేల మెజారిటీతో గెలుస్తాను, రమేష్ బాబు  ఒటమి ఖాయమంటూ గట్టిగా మండిపడ్డారు. ఇక టీడీపీ అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు తన గెలుపు పక్కా అంటున్నారు. ఎవరూ ఆపలేరని కూడా ధీమాగా చెబుతున్నారు. తనతో పోటీ పడిన రాజు గారు కలలు కంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఎలమంచిలిలో టఫ్ ఫైట్ జరిగిందని పోస్ట్ పోల్ సర్వేలు  ఘోషిస్తున్నాయి.



ఎవరు గెలిచిన మెజారిటీ స్వల్పమేనని కూడా లెక్క తేల్చుతున్నాయి. కానీ ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఇద్దరూ మాత్రం తామే గెలుపు గుర్రాలను ఆర్భాటంగా ప్రకటించుకోవడమె కాదు, ప్రత్యర్ధి చిత్తుగా ఓడిపోతారని ప్రచారం చేస్తున్నారు . ఇక్కడో విషయం వీరు మరచిపోయారని అంటున్నారు. జనసేన తరఫున బలమైన అభ్యర్ధిగా సుందరపు విజయకుమార్ పోటీ చేశారు, ఆయన గెలవకపోయినా ఓట్లను భారీగా చీల్చేశారని టాక్ నడుస్తోంది. అది ఎవరి కొంప ముంచుతుందో చూసుకోకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏంటి అంటున్నారు. మొత్తానికి ఎలమంచిలి ఈసారి ఎవరిది అన్న చర్చ ఇపుడు మరింత హీటెక్కిపోయేలా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: