తనపై వచ్చే వందతులు నమ్మొద్దటూ టీవీ9 రవి ప్రకాశ్ ఏకంగా టీవీ 9లోనే లైవ్ లోకి వచ్చి చెప్పేశారు. ఓ కేసును అడ్డుపెట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రవి ప్రకాశ్ లైవ్ లోనే చెప్పారు. దీంతో గురువారం ఉదయం నుంచి మీడయాలో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వచ్చిన వార్తలకు అడ్డుకట్ట పడింది. 


టీవీ నైన్ సీఈవోగా రవిప్రకాశ్ ను తొలగిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించిన కొన్ని గంటల్లోనే అదే ఛానల్లో రవిప్రకాశ్ లైవ్ కు వచ్చారు. తానే టీవీ నైన్ సీఈవోను అని చెప్పిన రవిప్రకాశ్.. సీఈవోగానే మాట్లాడుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మాట చెప్పాక ఇంకా ఎవరికీ అనుమాలు ఉండనక్కర్లేదు.. 

కానీ.. అక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. సాధారణంగా టీవీ9 లో లైవ్ మొదటైతే కనీసం అరగంట, గంట ఉంటుంది. కానీ రవిప్రకాశ్ సింపుల్‌గా మూడు, నాలుగు నిమిషాల్లో తాను చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పాడు. ఆయన కళ్లలో ఎన్నడూ లేని బెరుకు, తత్తరపాటు కనిపించాయి. 

నిజంగానే రవి ప్రకాశ్ కు ఎలాంటి దోషం లేకపోతే.. లైవ్ లో ఉదయం నుంచి మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు..అసలు ఈ కేసు విషయం ఏంటో వివరించవచ్చు.. చేతిలో మీడియా ఉంచుకుని కూడా కేవలం మూడు నిమిషాల్లోనే ముగించడం.. ఎవరో తరముతున్నట్టు, బెరుగ్గా మాట్లాడటం అసలు విషయాన్ని చెప్పడం కాకుండా కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: