నిరంతరం సంచలన వార్తలు అందించే వార్తా ఛానలే ఇప్పుడు సంచలన వార్తగా మారింది. తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఈవో రవిప్రకాశ్ తానే ఓ వార్తగా మారాడు. ఆయన యాజమాన్యంతో గొడవ పడుతున్నాడని.. అందులో భాగంగా ఓ ఫోర్జరీ సంతకం చేసి నేరం చేశాడని.. ఫిర్యాదు వచ్చింది. 


మీడియాకు ఇంతకు మించిన వార్తేముంది.. ఉదయం నుంచి రెచ్చిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. వాటిలో నిజమెంతో .. అబద్దమెంతో జనం నిర్ణయించుకునే లోపే .. సాయంత్రానికి ఏకంగా రవిప్రకాశ్ నేరుగా లైవ్‌లోకి వచ్చేశాడు. 

హమ్మయ్య.. ఇక రవిప్రకాశ్ మనకు అన్ని వివరాలు చెప్పేస్తాడని ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు. దీనికి తగ్గట్టుగానే రవిప్రకాశ్ కూడా పదునైన భాషతో తన లైవ్ షో ప్రారంభించాడు. దీన్ని ఆసక్తికరంగా జనం చూస్తుండగానే.. ఓ మూడు నిమిషాల్లో తన ప్రసంగం ముగించేసి గుడ్ బై చెప్పేసాడు రవి ప్రకాశ్. 

దీంతో అవాక్కవ్వడం జనం వంతు అయ్యింది. అసలు కేసేమిటి.. టీవీ నైన్‌లో వాటాలేమిటి.. ఛానల్‌ ఎందుకు అమ్మారు.. ఎంతకు అమ్మారు.. వాటాల సంగతేంటి.. ఈనెల 16 న విచారణకు వచ్చే  కేసు సంగతేంటి.. మధ్యలో శివాజీ ఎందుకు వచ్చాడు. ఉదయం నుంచి రవిప్రకాశ్ ఎందుకు తనపై వచ్చే వార్తలను ఖండించలేదు.. ఇలాంటి ప్రశ్నలెన్నో జనం బుర్రలను తొలుస్తుండగానే.. వచ్చినంత వేగంగా చకచకా పాఠం అప్పచెప్పినట్టి వచ్చి మెరుపు తీగలా మాయమయ్యాడు రవిప్రకాశ్. దీంతో జనం ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: