టీడీపీ అనుకూల మీడియా స్వచ్ఛమైన మీడియా రంగంలోకి కుల పోకడలను తీసుకొచ్చి మీడియాను బ్రష్టు పట్టించందని చెప్పడంలో ఎటువంటి ,సందేహం లేదు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాలో కొత్త చర్చ మొదలైంది. 'జగన్ సీఎంగా వస్తే..' అనే అంశం మీద తెలుగుదేశం అనుకూల మీడియా విశ్లేషణలు మొదలుపెట్టడం విశేషం.తెలుగుదేశం పార్టీకి బాగా జాకీలు వేసే ఒక మీడియా సంస్థ 'జగన్ వస్తే..' అనే టాపిక్ మీద చర్చ పెడుతూ ఉంది.


'జగన్ వస్తే రాజధాని మారిపోతుంది.. దొనకొండకు మారిపోతుంది..'అంటూ ఆ మీడియా అప్పుడే మొదలుపెట్టింది.ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజధానిని మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం.. 'జగన్ వస్తే రాజధాని మారుతుంది..' అంటూ మొదలుపెట్టింది.


ఇంకా ఫలితాలు రాకముందే 'జగన్ వస్తే..' అనే ఫీలింగ్ తో తెలుగుదేశం అనుకూల మీడియా కథనాలు రాయడం ఒక విశేషం అయితే జగన్ స్పష్టత ఇచ్చినప్పటికీ అందుకు విరుద్ధంగానే ఆ మీడియా వర్గాలు విశ్లేషణలు వినిపిస్తుండటం మరో పాయింట్! అయినా ఇప్పుడు ఇటువంటి కథనాల వలన ఫలితాల్లో ఎటువంటి మార్పు ఉండదు. మరీ ఎందుకు ఈ హడావిడి అని అర్ధం కావటం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: