Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 12:54 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: బాబు తన స్వార్ధం కోసం రాజకీయా లను కలుషితం చేస్తున్నంతగా వేరెవరూ చేయలేరు!

ఎడిటోరియల్: బాబు తన స్వార్ధం కోసం రాజకీయా లను కలుషితం చేస్తున్నంతగా వేరెవరూ చేయలేరు!
ఎడిటోరియల్: బాబు తన స్వార్ధం కోసం రాజకీయా లను కలుషితం చేస్తున్నంతగా వేరెవరూ చేయలేరు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ కు చెందిన నలభై మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారమే లేపింది. అనేక మంది ఇతర పార్టీల నేతలు దీనిపై విరుచుకు పడ్డారు. మోడీ ఏదో తృణమూల్ కాంగ్రెస్ నో, లేక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీనో భయ పెట్టడానికి అన్నారో,లేక బిజెపిలో స్థైర్యం నింపడా నికి అన్నారో కాని, ఆ మాటలు ప్రదాని స్థాయికి తగినవి కావని చెప్పక తప్పదు. ఏలా అన్నా అది నిర్ద్వంధంగా తప్పే!


అసలే దేశంలో ఈ పిరాయింపుల సమస్య పెరిగిపోయి, పిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్న వేళ, వాటిని అరికట్ట వలసిన ప్రధాన మంత్రి రాజకీయాల కోసం అలా మాట్లాడడం తప్పు అనటంలో ఎలాంటి సందేహం లేదు, రెండో మాట లేదు. నిజానికి గతంలో ప్రదాన మంత్రులు ఎవరూ ఇలా పిరాయింపులపై మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి. అలా అని వారు ఎవరూ పిరాయింపులను ప్రోత్సహించలేదని అనలేము.  

srichandra-neetulu

ఫిరాయింపుల చట్టం రావడానికి ముందు అదికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాలలో ఆరితేరింది. అప్పట్లో హర్యానాలో భజన లాల్ జనతా పార్టీ ప్రభుత్వాని కి నాయకత్వం వహించే వారు. ఇందిరాగాందీ 1980లో అదికారంలోకి వచ్చాక, మొత్తం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ముఖ్య మంత్రిగా కొనసాగారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 1978 లో కాంగ్రెస్ (ఐ) 180స్థానాలు గెలుచుకుని అదికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ (ఆర్) కు ముప్పై సీట్లు,జనతా పార్టీకి అరవై సీట్లు వచ్చాయి.కాని జనతా పార్టీ చీలిక లు, పీలికలై చివరికి నలుగురైదుగురు తప్ప అంతా అధికార కాంగ్రెస్ లో కలిసిపోయారు. కాంగ్రెస్ (ఆర్) కు చెందినవారైతే దాదాపు అంతా కాంగ్రెస్లోకి వెళ్లి సొంత ఇంటికి వెళ్లామని ప్రకటించారు. దాంతో అధికార పార్టీ సంఖ్య 260పైగానే అయింది.


కాని ఆ తర్వాత 1983లో జరిగిన ఎన్నికలలో ఎన్టిఆర్. నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్టిఆర్ మాత్రం తన పార్టీలోకి ఎవరైనా రాదలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని షరతు పెట్టారు. దాంతో ఒక్క నాదెండ్ల భాస్కరరావు మాత్రమే అందుకు అంగీకరించి పార్టీలో చేరారు. మరో ముగ్గురు కాంగ్రెస్ఎమ్మెల్యేలు వెనక్కి వెళ్లిపోయారు.

srichandra-neetulu

ఆ తర్వాత కాలంలో అప్పడప్పుడు కొన్ని పిరాయింపులు ఉమ్మడి ఎపిలో జరిగినా అవి అంత పెద్దగా ప్రభావం చూపించేవి కావని చెప్పాలి. కాని ఉమ్మడి ఎపి విభజన తర్వాత తెలంగాణలో కాని, విభజిత ఎపిలో కాని జరిగిన పిరాయింపులు తీవ్రమైనవనే చెప్పాలి.


అయితే దీనికి ఆద్యుడు ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. ఆధునిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పిరాయింపుల సూత్రధారి తోలి పాత్రధారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని చెప్పటంలో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదు. దానికి ఋజువు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓటుకు నోటు కేసు" తక్షణం గుర్తుకు వస్తుందనటంలో సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే దురుద్ధేశంతో ఆయన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ఎమ్మెల్యేని కోట్లకు కొనుగోలు చేసే యత్నం చేశారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దానిని అడ్డుకోగలగడమే కాకుండా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ని రెడ్-హాండెడ్ గా పట్టుకున్నారు.

srichandra-neetulu

తదుపరి చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్-డ్ మీ అనే ఆడియో టేప్ తో ఓటుకు నోటు కేసు సూత్రదారిగా దొరికిపోయారు. ఆ తర్వాత కెసిఆర్ ఎప్పటికైనా ఈ బెడద ఉంటుద ని అనుకున్నారో, ఏమో కాని ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఆకర్షించడం మొదలు పెట్టి సఫలం అయ్యారు. 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మందిని వరసగాలాగి,  టిఆర్ఎస్ లో విలీనం తీర్మానం చేయించి కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


2018 ఎన్నికలలో కెసిఆర్ ఘన విజయం సాదించిన తర్వాత కూడా అదే పద్దతి అనుసరించి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు.అయతే గతసారి మాదిరి ఓపెన్ గా చేయకుండా విలీనం దిశగా కద నడుపుతున్నారు.


ఇక ఎపిలో అయితే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా కోట్లుపెట్టి వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయం జగద్విదితం. అంతకుముందు తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు పిరాయిస్తే సంతలో పశువులు అమ్ముడుపోతు్న్నట్లు అమ్ముడుపోయారని చెప్పిన చంద్రబాబు ఎపిలో మాత్రం నిజంగానే సంతలో కొన్నట్లు ఒక్కొక్కరికి ఒక రేటు పెట్టారట. నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు.  మరికొందరికి వారి అవసరాలు, బలాన్ని బట్టి కోట్ల డబ్బు ముట్టచెప్పారు.


ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని గగ్గోలు పెడుతున్నారు. నలభై మంది టిఎమ్సి, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మోడీ అంటారా? అని హూంకరిస్తున్నారు. చిత్రమేమిటంటే 2014 ఎన్నికలు అయి ఫలితాలు వచ్చిన రెండు, మూడు రోజులలోనే నంద్యాల వైసిపి ఎమ్పి ఎస్పివై రెడ్డిని డిల్లీలో ఎపి భవన్ లోనే టిడిపి లోకి తీసుకుంటూ పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అలాగే చేర్చు కున్నారు. వారిపై చర్యలకు లోక్ సభ స్పీకర్ కు పిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. ఐదేళ్లు వారు ఇబ్బంది లేకుండా పదవులలో ఉండ గలిగారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా వంటి చోట్ల కూడా బిజెపి పిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించిందన్నవ విమర్శ ఎదుర్కుంది.


ఎపిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాని, తెలంగాణలో స్పీకర్ మధుసూదనాచారి కూడా పిరాయింపులపై చర్య తీసుకోవడం లో విఫలం అయ్యారు. దాంతో వారు కూడా గౌరవం కోల్పోయి అప్రతిష్టపాలయ్యారు. స్పీకర్ పదవికే కళంకంతేగా, వారి వ్యక్తి గత గౌరవం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయి "రాజకీయ అధముల్లో ప్రధములు" గా మిగిలిపోయారు. 

srichandra-neetulu

అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మాత్రం వీటికి అతీతంగా ఎవరైనా తన పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే రావాల్సిందే నని కండిషన్ పెట్టి విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్న పేరు తెచ్చుకున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం నీతులు చెబుతారు, కాని వాటిని పాటించకుండా చేయాల్సిన చండాలమంతా చేస్తారన్నది ఆయన పై ఉన్న ప్రధాన విమర్శ.


ప్రతి విషయంలోను డబుల్-టాక్, టంగ్-ట్విష్ట్, యు-టర్న్- ద్వంద్వ వైఖరే ఆయన సహజ గుణాలుగా మారిపోయిన విషయం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ప్రధాన నరేంద్ర మోడీని ఎవరూ సమర్దించలేం. కాని గురివింద నీతులు చెప్పే చంద్రబాబు వంటివారు మాత్రం నరేంద్ర మోడీని విమర్శించటం గమనించేసరికి మోడీ చేసిన పని చాల చిన్నతప్పుగా కనిపిస్తుంది.


అదే కెసిఆర్ గురివింద నీతులు గాని శ్రీచంద్ర నీతులు లాంటివేమీ చెప్పకుండా తన పని తాను చేసుకుంటుంటే, చంద్రబాబు మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే వినేవారికి పిచ్చి పడుతుంది.


ముందుగా తాను చేసిందేమిటో చెప్పి, అందుకు క్షమాపణలు చెప్పి, ఆ తర్వాత మోడీని అయినా, మరెవరిని అయినా విమర్శించవచ్చు, పైకి నీతులు చెబుతూ, లోపల మాత్రం అనైతిక రంకు రాజకీయాలకు తెరలేపుతారు చంద్రబాబు. ఈ దేశ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని అనుకోవలసి వస్తుంది. అది నరేంద్ర మోడీ అయినా, చంద్రబాబు అయినా, మరొకరు అయినా ఒకటే.

srichandra-neetulu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
బీజేపీ 100 స్థానాలకే పరిమితం : మమత జోస్యం: కాదు 300 స్ధానాలు గెలుస్తాం: మోదీ ధీమా
About the author