హైద‌రాబాద్ శివారు ప‌హాడి ష‌రీఫ్‌లో దారుణం జ‌రిగింది. ఏడేళ్ల బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతిదారుణంగా పాశ‌వికంగా బండ‌రాయితో మోది చంపేశారు. ర‌క్త‌పు మ‌డుగులో విగ‌త‌జీవిగా ప‌డి ఉన్న ఈ బాలుడి పేరు మ‌హ్మ‌ద్ యాషిన్‌. క‌ర్నాట‌క‌లోని యాద‌గిరి జిల్లాకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ భాషామియ్య ఉపాధి కోసం గ‌తేడాది హైద‌రాబాద్ కు వ‌ల‌స వ‌చ్చారు. 


ప‌హాడీష‌రీఫ్ ప్రాంతంలోని ముస్త‌ఫాహిల్స్ ప్రాంతంలో భార్య‌, న‌లుగురు కుమారుల‌తో క‌లిసి నిమాస‌ముంటోంది మ‌హ‌మ్మ‌ద్ భాషామియ్య కుటుంబం. గ‌త రాత్రి తొమ్మ‌దిన్న‌ర గంట‌ల ప్రాంతంలో ఫ్రూట్ జూస్ తెచ్చుకునేందుకు చిన్న కుమారుడు యాషిన్ తండ్రిని అడిగాడు. దీంతో భాషా మియ్య 50 రూపాయ‌లు ఇచ్చాడు. దుకాణానికి వెళ్లాడు యాసిన్‌. ఇక రాత్రి పుట ఒంట‌రిగా వెళ్తున్న బాలుడిని గ‌మ‌నించిన దుండ‌గులు బ‌ల‌వంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెల్లారు. 


చెట్ల పొద‌ల‌తో జ‌న సంచారం లేని ప్రాంతంలో బాలుడిపై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడు గ‌ట్టిగా కేక‌లు పెట్ట‌డంతో స‌మీపంలోని డాబాపై ఉన్న ఓ మ‌హిళ ఇదంతా గ‌మ‌నించి గ‌ట్టిగా కేక‌లు వేసింది. బాలుడిని కిడ్నాప్ చేసి ఈడ్చుకుపోతుండ‌టంతో ఏడుస్తాడేమోన‌ని భావించిన దుండ‌గులు.. బాలుడి త‌ల‌పై బండ‌రాయితో మోదీ ప‌రార‌య్యారు.

చీకట్లో పారిపోతున్న హంత‌కుల‌ను జ‌నం వెంబ‌డించారు. అయితే చీక‌ట్లో హంత‌కుడిని స‌రిగా గుర్తించ‌లేక‌పోయామ‌ని చెప్పారు. బాలుడి హ‌త్య‌కు గుర‌య్యాడ‌నే వార్త విన్న ముస్త‌ఫాహిల్స్ గ‌ల్లీవాసులు పెద్ద సంఖ్య‌లో ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. హ‌త్య ఉదంతం అంద‌ర్నీ క‌లిచివేసింది. బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా మార్చురీకి త‌ర‌లించారు. 


అయితే నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో త‌ర‌చు జ‌రుగుతూనే ఉన్న‌ట్లు స్థానికులు చెప్పారు. రాత్రి వేళ అయితే మ‌రి దారుణం ప‌రిస్థితి ఉంటుంద‌ని అన్నారు స్థానికులు. అసాంఘింక శ‌క్తులు, గంజాయి, మ‌ద్యం సేవిస్తూ వీరంగం సృష్టిస్తున్నార‌ని వాపోయారు. ఇలాంటి హ‌త్య‌ల‌కు కూడా తెగ‌బ‌డ‌తార తాము ఊహించ‌లేద‌ని వాపోతున్నారు. పొట్ట‌కూటి కోసం వ‌చ్చిన త‌న‌కు ఎవ్వ‌రూ శ‌త్రువులెవ‌రూ లేర‌ని ప‌సివాడు చేసిన పాప‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నాడు బాలుడి తండ్రి. 


ఇంత‌కీ బాలుడిని ఎవ‌రు హ‌త్య చేశారు..? హ‌ంత‌కులు ఎవ‌రూ? మ‌హ‌మ్మ‌ద్ బాషామియ్య శ‌త్రులవులే బాలుడిని హ‌త్య చేశారా ? గ‌తంలోనూ ఈ నిర్మాణుష్య ప్ర‌దేశంలో ఎన్నో ఆకృత్యాలు జ‌రిగినా.. పోలీసులు ఎందుకు ప‌ట్టించుకోలేదు..? ఈ గ్యాంగ్ వెనుక ఉన్న‌దెవ‌రు..? అసాంఘిక కార్య‌క‌లాపాల‌పై ముస్త‌పా కాల‌నీవాసులు ఎందుకు పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌లేదు..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: