అవును చంద్రబాబునాయుడుకు శ్రీకాకుళం నియోజకరవర్గంలోని తమ్ముళ్ళు పెద్ద షాకే ఇచ్చారు. తమ్ముళ్ళిచ్చిన షాకు ఎలాగుందంటే వాళ్ళపై ఉన్న కోపాన్ని అక్కడే ఉన్న ఇతర నియోజకవర్గాల  తమ్ముళ్ళపై చూపేంతగా.  ఇంతకీ  విషయం ఏమిటంటే ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంపై సమీక్ష పెట్టుకున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని ముందుగానే అభ్యర్ధితో పాటు నేతలకు కూడా పార్టీ కార్యాలయం సమాచారం ఇచ్చింది.

 

శుక్రవారం సమీక్ష మొదలయ్యే సమయానికి శ్రీకాకుళం నుండి అసెంబ్లీ అభ్యర్ధి గుండ లక్ష్మీదేవి హాజరుకాలేదు. ఎంఎల్ఏ హాజరుకాలేదు కాబట్టి నియోజకవర్గంలోని నేతలు కూడా ఎవరూ కనబడలేదు. మొదటి ఏ టిఫిన్ తినటానికో లేకపోతే కాఫీ తాగటానికో వెళ్ళుంటారని అనుకున్నారట.  అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట.

 

లక్ష్మీదేవి దగ్గర బంధువుల్లో ఈమధ్యనే ఒకరు మరణించారు. కాబట్టి ఆమె హాజరుకాలేదని తెలిసింది. ఎంఎల్ఏ గైర్హాజరయ్యారంటే ఏదో కారణం ఉందని అనుకున్న మరి నియోజకవర్గంలోని నేతలు ఎందుకు హాజరుకాలేదు ? ఎందుకంటే, ఎంఎల్ఏనే హాజరుకానపుడు తాము మాత్రం హాజరై చేసేదేముంటుందని తమ్ముళ్ళనుకున్నారట.

 

ఆ విషయం తెలియటంతోనే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమీక్షకు రమ్మని ముందుగా కబురు చేసినా ఇంతగా నిర్లక్ష్యమా అంటూ మండిపోయారు. సమీక్షలకు రమ్మని చెబితే కచ్చితంగా హాజరుకావాల్సిందేనంటూ గట్టిగా చెప్పారట. దాంతో శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చిన ఇతర నియోజకవర్గాల నేతలెవరూ సమాధానం చెప్పకుండా మవునంగా ఉండిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: