అవును జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఇన్నాళ్లు కుల పార్టీకి కొమ్ము కాసిన ఆ రెండు పత్రికలు కలవరపడుతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి ఊడిగం చేయడం అలవాటు చేసుకున్న ఆ రెండు పత్రికలు ఇప్పుడు అంతర్మధనంలో పడ్డాయి. అధికార పార్టీ అజమాయిషీ, అడక్కుండానే వచ్చిపడుతున్న కోట్ల రూపాయల అడ్వర్టైజ్ మెంట్లు.. మేనేజ్ మెంట్ నోళ్లు నొక్కేశాయి. మరి ఈదఫా పరిస్థితి ఏంటి? టీడీపీ పరాజయం ఖాయమైన వేళ, జగన్ అధికారంలోకి వస్తున్నారని స్పష్టమైన సంకేతాలున్న సమయంలో ఆ సెక్షన్ మీడియాలో కలవరం మొదలైంది.


జగన్ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్ ఏంటని, తమ పాపం పండే రోజొచ్చిందని ఆందోళన పడుతున్నాయి యాజమాన్యాలు. కొన్ని పత్రికలు, ఛానెళ్ల పేర్లు చెప్పి మరీ జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఓ స్పష్టమైన సంకేతాన్నిచ్చారు. ఆయా ఛానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, ప్రతిపక్షంపై నిందలేస్తూ, అధికార పార్టీ ఆగడాలను కవర్ చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. సో.. ఆయా పత్రికలు, ఛానెళ్ల విశ్వసనీయతపై ప్రజల్లో ఓ స్పష్టమైన అవగాహన తీసుకొచ్చారు జగన్.


రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి నక్కజిత్తుల మీడియాను నమ్మే ప్రసక్తే ఉండదు. జగన్ కు మీడియా అన్నా, జర్నలిస్ట్ లన్నా ఎంతో గౌరవం. అదే సమయంలో అధికార పార్టీకి వంతపాడే యాజమాన్యాలపై మాత్రం ఆయన వైఖరి స్పష్టం. సో.. ఫలితాల తర్వాత మీడియానే తన వైఖరిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి సహకరించాలా లేక ఇంకా అబద్ధాల బాబుకి వంత పాడాలా అనే విషయం యాజమాన్యాలే తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే మీడియా సంస్థలు కిందామీడా పడుతున్నాయి. జగన్ క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: