టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ కు ఆ సంస్థలో ఉన్నది కేవలం 8 శాతం మాత్రమే షేర్లు. కానీ టీవీ 9 మీద పెత్తనం మాత్రం మొత్తం అతనిదే. బాధ్యతలు అప్పగిస్తే రవిప్రకాష్ తప్పుడు పనులు చేశాడని, సంతకాలు ఫోర్జరీ చేశాడని ఆ యాజమాన్యం రవి ప్రకాష్ మీద సైబర్ క్రైమ్ కు ఫిర్యాదులు కూడా చేసింది. వంద గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వానకు రాలిందన్నట్టుగా... ఎన్నో నీతులు చెప్పిన రవిప్రకాష్ ఈ నీతిమాలిన పని ఆరోపణలతో కేసులను ఎదుర్కొంటున్నాడు. ఎనిమిది శాతం వాటాతో తొంభైశాతం వాటా కలిగిన వారిపై ఆయన రుబాబు చేస్తున్నాడని స్పష్టం అయిపోయింది.


ఈ వ్యవహారం కేసుల దాకా వెళ్లినా టీవీ నైన్ ఇంకా రవిప్రకాష్ గుప్పిట్లోనే ఉందనే భావన కలుగుతూ ఉంది ప్రేక్షకుల్లో. రవి ప్రకాష్ ను టీవీ నైన్ యాజమాన్యం సీఈవో పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా అతడు మళ్లీ ఆ టీవీ చానల్ తెరపై కనిపించడమే సంస్థపై అతడికి ఉన్న పట్టును తెలియజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక సంస్థలో తొంభైశాతం వాటా ఉన్నవారు రవి ప్రకాష్ మీద కేసులు పెట్టారు.


అతడు చేసిన మోసాన్ని వారు పోలీసులకు విన్నవించారు. అయితే  వారి చానళ్లోనే వారిని మోసంచేసిన వ్యక్తి ప్రత్యక్షమై.. వారి మీదే ఎదురుదాడి చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మోసపోయిన వారి మీద మోసం చేసిన వ్యక్తి వారి మీడియానే అడ్డం పెట్టుకుని ఎదురుదాడి చేస్తున్న కలికాలం ఇది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీవీ 9 ఇంకా రవి ప్రకాష్ గుప్పిట్లోనే ఉందని, ఎనిమిది శాతం వాటాతోనే ఇప్పటికీ అతడు ఆటలు ఆడుతున్నాడని.. కొత్త యాజమాన్యం మొత్తం సంస్థను గుట్లుముట్లన్నింటినీ కనుగొంటే తప్ప.. రవి ప్రకాష్ బారి నుంచి అది బయటపడలేదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: