తాజా ఎన్నికల్లో బీజేపీ మొత్తం 104 స్థానాలను గెలుచుకుంది. బల నిరూపణకు ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 111. అయితే ఆ సంఖ్యను చేరుకునేందుకు బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. అయితే, అధికారం కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేసినప్ప‌టికీ సాధ్యం కాలేదు. దీంతో జేడీఎస్‌- కాంగ్రెస్ కూటమి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా, ఆ కూట‌మిలో చీలిక వ‌చ్చింద‌ని తెలుస్తోంది. య‌డ్యుర‌ప్ప మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా లేరని  అన్నారు. ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఏ సమయంలోనైనా ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చునని తెలిపారు. ఏం జరగబోతుందో వేచి చూద్దామన్నారు.


కాగా, బీజేపీ త‌మ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఇప్ప‌టికే కుమార‌స్వామి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. మోదీ సర్కార్ తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందన్నారు. ఈడీ కేసులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై వత్తిడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడ.. ప్రాంతీయ పార్టీలతో కలిసి.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: