ప్ర‌ముఖ సీరియ‌ల్ రాజారాణిలో న‌టిస్తున్న‌ టీవీ న‌టి రితికాకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఇంట్లోకి చొరబడి టీవీ నటిని త‌నకిచ్చి పెళ్లి చేయాల‌ని బెదిరింపులకు పాల్పడిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సీరియ‌ల్‌లో రితికాను చూసిన ఆ విద్యార్థి ఆమెపై మ‌న‌సు పారేసుకున్నాడు. త‌నను ఇష్ట‌ప‌డ్డాడు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. 


కాగా.. రితికా  వడపళని వందడుగుల రహదారి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో తండ్రితో పాటు ఆమె నివాసముంటోంది. రితికాపై మ‌నుప‌డ్డ ఆ విద్యార్థి ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్‌కు వెళ్లాడు. వెళ్లి డోర్ కొట్టాడు. దీంతో ఆమె తండ్రి డోర్ తీశాడు. ఈ క్ర‌మంలోనే రితికా ఇంట్లోకి చొర‌బ‌డ్డ యువ‌కుడు రితికాను త‌న‌కిచ్చి వివాహం చేయాల‌ని ఆమె కుటుంబ‌స‌భ్యుల‌ను బెదించాడు. అంతే కాదు రితికా తండ్రితో వాగ్వాదానికి దిగాడు. 

ఇదంతా గ‌మ‌నించిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. యువ‌కుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కాగా.. బెదిరింపుల‌కు పాల్ప‌డిన యువ‌కుడిని గోబిచెట్టిపాళేయానికి చెందిన భ‌ర‌త్‌గా గుర్తించారు. అయితే అత‌డు ఉద్యోగం కోసం చెన్నై వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. తనకు రితికా అంటే చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకుంటానని భరత్ విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. 


త‌మిళంలో ప్ర‌ముఖ టీవీ సీరియ‌ల్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు రితికా. ఓ ఛాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న రాజారాణి సీరియల్‌తో పాటు ప‌లు సీరియల్స్‌లో నటిస్తోంది. అలాగే ఆమె డబ్‌స్మాష్, టిక్‌టాక్ యాప్‌ల్లోనూ తరుచూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫేమస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: