Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:06 am IST

Menu &Sections

Search

బొమ్మాళీ నిన్నొదల! టివి9 పై మాజీ సిఈవో రవిప్రకాష్ వ్యాఖ్యలు!

బొమ్మాళీ నిన్నొదల! టివి9 పై మాజీ సిఈవో రవిప్రకాష్ వ్యాఖ్యలు!
బొమ్మాళీ నిన్నొదల! టివి9 పై మాజీ సిఈవో రవిప్రకాష్ వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టీవీ9 ముఖ్య నిర్వాహణాధికారి పదవి తనను తప్పించడంపై రవిప్రకాశ్ స్పందించారు. అసత్యాలతో మోసగించి, దొడ్డిదారిలో "టివి9 - ఎబిసిఎల్" సంస్థలోకి చొరబడ్డారని అన్న అలంద మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతల అండదండలతో పాత్రికేయ వృత్తిని నాశనం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. 
సీఈవోగా తప్పించినా కూడా ఎప్పటికైనా ఒక షేర్ హోల్డర్‌గా, ఆ వాటా ప్రతినిధిగా టీవీ9 లో అలంద మీడియా పక్కనే తాను నీడగా ఉంటానని స్పష్టం చేశారు రవిప్రకాశ్. టీవీ9ని ఎప్పటికి కూడా వదలబోనని పరోక్షంగా తేల్చిచెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో టివి9 వ్యవస్థాపక అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ravi-prakash-now-out-of-tv-9
దేశంలో పాత్రికేయ వృత్తిని కాపాడడానికి, మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించటానికి తన ప్రయత్నం తాను కొనసాగుతూనే ఉంటానని రవిప్రకాశ్ స్పష్టం చేశారు. కాగా, నేడు (శుక్రవారం) సమావేశమైన అలంద మీడియా డైరెక్టర్స్ బోర్డు టీవీ9 సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయనకు అదనంగా టీవీ9 తెలుగు బాధ్యతలను అప్పజెప్పింది. అటు గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10 టీవీ సీఈవోగా పనిచేస్తున్నారు. ఆయనను టీవీ9 సీవోవోగా నియమిస్తూ అలంద మీడియా డైరెక్టర్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. టీవీ9 ఉద్యోగులతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ravi-prakash-now-out-of-tv-9
అయితే చివరగా కంపనీ నుండి వెళ్ళేముందు రవిప్రకాశ్ ఈ క్రింది వ్యాఖ్యలు చేశారు: 

"మీరు రాజకీయనేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనంచేసే లక్ష్యంతోపనిచేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టివి9 నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఎన్‌సిఎల్‌టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఒక ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసు లుపెట్టారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ లో అక్రమమార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టివి9 స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులతో నన్ను వేధించే ప్రయత్నం చేశారు. పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులువేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు" 

ravi-prakash-now-out-of-tv-9

ravi-prakash-now-out-of-tv-9
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“మోదీ కూడా టివీ చూస్తున్నారు జాగ్రత్త!": నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా
విలువలే లేని ఈ రాజకీయ నేతని చూసి జాతి మొత్తం సిగ్గుపడాలి!
నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
నైజాం భూగర్భం వజ్రాలమయం - బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
About the author