చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి అదే మాట అంటున్నారు. 150 సీట్లు మనకే వస్తాయి. ఇది నిజం తమ్ముళ్ళూ అంటూ గొంతు చించుకుంటున్నారు. అయితే అధినేతలో ఉన్న ధైర్యం తమ్ముళ్లకు రావడం లేదు. ఎందుకంటే వారంతా క్షేత్ర స్థాయిలో  పరిస్థితి చూసిన వారు. అయినా ఎన్ని రోజులని రిజల్ట్ రావడానికి. మే 23న రాజేవరో  పక్కాగా  తేలిపోతుందిగా.


శ్రీకాకుళం జిల్లా పార్టీ రివ్యూ మీటింగులో చంద్రబాబు కీలక‌మైన కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి అసలు పోటీయే కాదు. జగన్ తో మనకు పోటీ ఏంటి. అయితే వైసీపీ  ప్రతిపక్షంలో ఉండబట్టి కొంతమంది అటు వైపు ఓటు వేశారంతే ఇదీ బాబు గారి ధియరీ. జగన్ ఆయన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ  టీడీపీని ఢీ కొట్టలేరన్నది బాబు గారి వాదన.


మనమే మళ్ళీ గెలుస్తున్నాం. 150 సీట్లు రావడం ఖాయం తమ్ముళ్ళు అంటూ బాబు గట్టిగా చెప్పారు. ఏపీలో టీడీపీ జెండా ఎగరడం వేయి శాతం నిజం. ప్రతీ చోటా పసుపు పార్టీ రెపరెపలే అన్నారట బాబు. బాగానే ఉంది. జగన్ పోటీ కాదు, వైసీపీకి సీన్ లేదు అని చెబుతున్న బాబు ఎన్నికల ముందు నానా హైరానా ఎందుకు పడ్డారో. పైగా పసుపు కుంకుమ, పించన్లు, రైతులకు పెట్టుబడి  సాయం వంటి వరాలు ఎందుకు కురిపించారోనని తెగ సెటైర్లు పడుతున్నాయి. ఎవరి ఎవరితో పోటీ పడ్డారో 23న తేలిపోతుంది అంటున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: